ePaper
Monday, April 27, 2026
📄 ePaper

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

📰 Generate e-Paper Clip



*ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు*

*ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం) సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల వివరాల విడుదల.*

*ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.*

*ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ పిలుపు.*

ఆదిలాబాద్ :  జిల్లా వ్యాప్తంగా సంఘవిద్రోహ శక్తులతో పోరాడి అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) ను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు కార్యాలయాలలో మరియు ప్రజల సమక్షంలో ఫ్లాగ్ డే (అమరవీరుల) వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల కు సంబంధించి వివరాలను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రజాహిత కార్యక్రమాలలో ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లాగ్ డే ను విజయవంతం చేయాలని తెలిపారు.

అక్టోబర్ 21, ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం).*

అక్టోబర్ 21న స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతి నిధులు స్థానిక ప్రజలు కలిసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అమరవీరుల కుటుంబ సభ్యులకు అత్యంత గౌరవంతో ఆహ్వానించి, బహుమతుల ప్రధానం చేయడం జరుగుతుంది.

*మెగా రక్తదాన కార్యక్రమం.*

జిల్లా పోలీసులు మరియు ప్రజల సహకారంతో ఈనెల 22వ తారీకున స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు భారీ ఎత్తున మెగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఓపెన్ హౌస్ కార్యక్రమం.

ఈనెల 23వ తారీఖున ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడును.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, చేయు విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన అంశాలపై, పోలీసులు చేసిన ప్రతిభ, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. ప్రతి పోలీస్ స్టేషన్లో మండలల వారీగా విద్యార్థులను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి పోలీస్ స్టేషన్ నిర్వహణపై అవగాహనను కల్పించడం జరుగుతుంది.

*సైకిల్ ర్యాలీ*

అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు ఈనెల 23వ తారీఖున సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

*పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల చిత్రపటాల ఏర్పాటు.*

వారోత్సవాలు మొదలు నుండి పూర్తి అయ్యేవరకు  ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల చిత్రపటాలను ఏర్పాటుచేసి జిల్లా ప్రజలకు వారి ప్రాణత్యాగాలను స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు.

*షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు.*

జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, మరియు వీడియో గ్రాఫర్లకు, చిన్న డైరెక్టర్లకు, ప్రజలందరికీ పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా, రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు కమ్యూనిటీ పోలీసింగ్ మూఢనమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన ప్రకృతి వైపరీత్యాలలో పోలీసులు చేసే సేవ, ఇతర పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్ ఫిలిం వీడియోలను రూపొందించాలని, ఉత్తమ మొదటి మూడు ఫోటోలను మరియు వీడియోలను జిల్లా స్థాయిలో బహుమతిని ప్రధానం చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫోటోలను మరియు వీడియోలను ఈనెల 23 తారీకు లోగా వివరాలతో సహా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్ఐబి మరియు ఐటి కోర్ కార్యాలయంలో అందించాలని సూచించారు.

*విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు 3 భాషలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ లలో
*అంశం*
డ్రగ్స్ నిర్వహణ : నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.

Drugs menance:  Role of police in preventing and how students can stay away from drugs

1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి:
👉 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.
3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

అనే అంశంపై మూడు భాషలలో మొదటి మూడు బహుమతులను విడివిడిగా అందజేయడం జరుగుతుందని అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

*5K రన్ పరుగు కార్యక్రమం*

24 వ తారీఖున ఉదయం ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 2000 మంది విద్యార్థులతో భారీ ఎత్తున 5K రన్ (పరుగు) కార్యక్రమం నిర్వహించబడును దీనికి ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88