Tuesday, November 11, 2025

Breaking News : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల కఠిన కారగారా శిక్ష

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



🟥 బాధితురాలికి నాలుగు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మైనర్ బాలికను అత్యాచారం చెసిన నేరస్తుడికి కేసులో 20 సంవత్సరాల కఠిన గారాగార శిక్ష మరియు రూ.2000 ల జరిమానా విధిస్తూ ఫోక్సో స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి మాధవి కృష్ణ తీర్పు వెలువరించారు.

ఉట్నూర్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని నేరం జరిగిన ఐదు నెలలోనే నిందితుడికి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్సొ కోర్ట్ ద్వారా శిక్షపడేలా చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చేశారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి



ఈ సందర్బంగా జిల్లా ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు ….
కేసు వివరాలలో ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తారీఖున ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉట్నూరు గ్రామం నందు పాత బస్టాండ్ ప్రాంతం నందు జరిగినది. మహారాష్ట్రకు చెందిన బాధిత కుటుంబం భిక్షాటన కోసం ఉట్నూర్ ప్రాంతమునకు ఒక కుటుంబం తన ఇద్దరు పిల్లలతో వచ్చినది అందులో భాగంగానే దరఖాస్తుదారు ( తల్లి) యొక్క పెద్ద కుమార్తె 6 సం” మైనర్ బాలిక పోచమ్మ గుడి కమాన్ వద్ద భిక్షాటన చేస్తున్న సమయంలో ఎదురుగా షాపులో కూర్చున్న నేరస్తుడు *షేక్ ఖలీద్(45)* మైనర్ బాలికను మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదు రూపాయలు డబ్బును ఆశ చూపి పాపను ఒడిలో కూర్చోబెట్టుకొని తన మర్మాంగం నందు వేలు పెట్టగా, పాప విడిపించుకుని ఏడ్చుకుంటూ తల్లి వద్దకు వెళ్లెను ఆ పాపను గమనించగా మర్మాంగం నుండి రక్తం కారుతున్నదని గమనించి అట్టి వ్యక్తిని మందలించడానికి ప్రయత్నించగా అతని పారిపోయినాడు. ఈ విషయంపై బాధితురాలు తల్లి ఏప్రిల్ 15వ తారీఖున ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాను.

ఎస్సై భరత్ సుమన్ crime number 75/2022, U/Sec 376AB IPC,5 r/w 6 pocso act, 3(2)(v) SC ST POA act ల తో కేసును నమోదు చేసి, 24 గంటల లోపే నేరస్తుని పట్టుకొని రిమాండ్ చేసి, ఎఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయగా, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్సు కోర్టుకు దాఖలు చేయగా, ఫోక్సు స్పెషల్ పి పి ముసుకు రమణారెడ్డి గారు 9 మంది సాక్షులను విచారించి ఈరోజు గౌరవనీయులు పోక్సో కోర్టు న్యాయమూర్తి మాధవి కృష్ణ గారు నిందితునికి నేర నిరూపణ అయిన కారణంగా 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 2 వేల రూపాయల జరిమానా, జరిమానా కట్టని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్షను విధిస్తూ, బాధితురాలికి రూపాయలు నాలుగు లక్షల నష్టపరిహారం అందించాలని చైర్మన్ న్యాయ సేవ అధికార సంస్థను కోరుతూ తీర్పును వెలువడించారు.

అత్యాచార నేరస్తుడు షేక్ ఖళీద్

ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నందు ఐదు నెలల లోపే తీర్పును వచ్చే విధంగా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారి ఎఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్ తన మొదటి ఫోక్సో కేసు నందు అనతి కాలంలోనే ఇన్వెస్టిగేషన్ చేసి చార్జిషీటు దాఖలు చేసినందుకు, పి పి ముసుకు రమణారెడ్డి, సిడిఓ నరేందర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ గుణవంతరావు, కోర్టు లైసెన్ధికారి ఏం గంగా సింగ్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నేరం చేసిన ఎటువంటి నేరస్తునికైనా శిక్ష ఖచ్చితంగా పడేలా న్యాయవ్యవస్థ పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!