500 రూపాయల కోసం భార్యాభర్తలు ఆత్మహత్య

📰 Generate e-Paper Clip


కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్ లో నివసిస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ మధ్య 500 రూపాయల విషయమై శనివారం రోజు చిన్నపాటి గొడవ మొదలైంది..

భార్య 500 రూ”అడిగితే ఇవ్వలేదని తాగిన మైకంలో భార్య మీద కోపంతో రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా..

అది గమనించిన భార్య కనకదుర్గ వెంటనే ఆ విషయాన్ని కుమారుడుకీ వివరించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు. విషయం తెలుసుకున్న కుమారుడు తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు..

తండ్రి మరణ వార్తను కుమారుడు తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయగా. , భర్త మరణ వార్త విన్న కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని ఉండటంతో చూసిన కొడుకు తన తల్లినైన కాపాడుకోవాలని ఉద్దేశంతో తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది.

బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుగు పొరుగువారు ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments