Breaking News : ఇంస్టాగ్రామ్ లో వేధింపులకు బాలిక బలి

📰 Generate e-Paper Clip

ఇచ్చోడా పోలిసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు….. : యువతి తల్లి

మా అమ్మాయి ఇచ్చోడా ఎస్సై కి ఎన్నో సార్లు ఫోన్ చేసి న్యాయం చేయాలనీ కోరింది : యువతి తల్లి

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామం లో దారుణం చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న యువతి తల్లి మాటల్లో….

సామజిక మద్యమం అయినా ఇన్స్టాగ్రాం లో తన పేరిట ఫెక్ ఐడి క్రీయేట్ చేసి వేదించడం తో పదో తరగతి బాలిక ఆత్మహత్య కు పునుకుంది.

తన పేరు మీద నకిలీ ఐడీలు తయారు చేసి అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ముస్లే సాక్షి (16) అనే బాలిక.

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన…

ఐ వాంట్ జస్టీస్ అంటూ తన పేరు మీద నకిలీ ఐడి తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించిన బాలిక…

కుటుంబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు

గతంలో ఇదే విషయం పై పోలీసులకు తెలిపిన సకాలంలో స్పందించలేదని మృతి చెందిన బాలిక తల్లి ఆరోపిస్తుంది. ఎన్ని సార్లు పోలీసులను కలిసిన చూస్తాము అమ్మ అన్ని పంపించివేషారని అంటుంది. ఏదేమైనా పోలీసుల విచారణ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఏదేమైనా సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, అనర్థలు కూడా అంతే రేంజ్ లో ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments