కేసీఆర్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో  ప్రజలను మోసం చేస్తుంది : ఆడే గజేందర్

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : కేసీఆర్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో  ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ అన్నారు.
           టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతు రచ్చబండ కార్యక్రమం సోమవారం కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ ఆధ్వర్యంలో బోథ్ మండలం లోని నారాయణపూర్ గ్రామంలో  రైతులు,నిరుద్యోగ యువకులు,గ్రామ ప్రజలతో కలిసి రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బోథ్ నియోజకవర్గ నాయకుడు గజేందర్ ఆడే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తుందో వివరించారు. లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి మూడు సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు రుణమాఫీ చేయకపోవడం రైతులను మోసగించడమే అని అన్నారు.  దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దళితులను మోసం చేయడమే అని అన్నారు.  అన్ని విధాలుగా ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో  ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నరూ  అని తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ మండల కన్వీనర్ కురుమే మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్,కిసాన్ సెల్ నాయకులు బొడ్డు గంగారెడ్డి మరియు ఉమేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments