📰 కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలి : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
📰 నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులతో శాంతిభద్రతలపై నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ సబ్ డివిజినల్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన కేసులో దర్యాప్తు అంశాలపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విజయ సాధనకు ఒక ముందు చూపు, దానిని సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం పోలీసు అధికారులు కలిసి ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు నచ్చే విధంగా మనం అందించే సేవల్లో మరియు కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నేరాలను కాకుండా కాలానుగుణంగా సమాజంలో ఉద్భవించిన నేరాలతో అప్రమత్తంగా ఉండి అరికట్టేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులు పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలి.


ఈ నేర సమీక్ష సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అయినా గుట్క,మట్కా,గంజాయిని అంతమొందించే దిశగా రాత్రింబవళ్ళు కృషి చేయాలని పేర్కొన్నారు. మరియు వర్టికల్స్ లో భాగంగా గల బ్లూ కోట్, పెట్రో కార్, సెక్షన్ ఇన్ఛార్జ్, స్టేషన్ రైటర్, కోర్టు, సమ్మోన్స్, ఎస్ హెచ్ ఓ, 5 ఎస్ (court, summons, sho, 5s) తదితర అంశాల్లో సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్ పి ఎస్ శ్రీనివాస రావు, డీఎస్పీ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, సిఐలు పి సురేందర్, కే శ్రీధర్, కె నరేష్ కుమార్, బి రఘుపతి, కే మల్లేష్, బి మల్లేశ్ ఆదిలాబాద్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారులు, సిసి దుర్గం శ్రీనివాస్, డిసిఆర్బి ఎస్ ఐ హకీమ్, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments