రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ తన యొక్క ద్విచక్రవాహనం అయినా కెటిఎం డ్యూక్ 250 KTM DUKE 250 రిజిస్ట్రేషన్ నెం.TS08HM1988 ను రిమ్స్ బాయ్స్ హాస్టల్ ముందు పార్క్ చేయగా దొంగతనం జరిగిందని తేదీ 03/12/2021 న అదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి దొంగిలించిన వ్యక్తులు ఆదిలాబాద్ లోని సంజయ్ నగర్ కు చెందిన ఎస్ ముషరాఫ్(19) మరియు కొలిపుర కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (21) లుగా గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ కు తరలించారు. మంగళవారం రోజు అనగా 10/05/22 న కోర్టు వారు నేరస్తులను విచారించగా నేరస్తులను నేరస్తులు నేరం ఒప్పుకొన్నారు. దింతో జుడిసియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అదిలాబాద్ కుమారి మంజుల సూర్యవార్ నేరస్తులకు 5 నెలల జైలు శిక్ష విధించారు అని అదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీధర్ తెలిపారు. ఇన్స్పెక్టర్ వెంట కోర్టు డ్యూటీ ఆఫీసర్ జోగు శ్రీకాంత్ వున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments