రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ :
మండలంలోని బొస్రా గ్రామానికి చెందిన సొన్టకె శివ (26) అనే యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుని తండ్రి ఫిర్యాదు లో తెలిపిన వివరాల ప్రకారం సొన్టకె శివ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురువారం రోజు తన తండ్రి బావ్ సింగ్ వ్యవసాయ క్షేత్రంలో ఉండగా శివ కూడా అక్కడే ఉన్నాడు కొద్దిసేపు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్నాంక శివాను ఇంటికి రమ్మని చెప్తే ఇంటికి వెళ్లకుండా అక్కడితో వెళ్లిపోయాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో భూతయి గ్రామానికి చెందిన వికాస్ అనే అతనికి ఫోన్ చేసి నేను ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పినట్లు తెలిపారు.
జాతర్ల పక్కన ఉన్న క్రషర్ వద్దకు వెళ్లి చూడగా నీటి కుంటలో తన కొడుకు మృతదేహం పడి ఉంది.
అయితే తన కొడుకు ఎలుకల మందు తాగి నీటి కుంటలో పడి మృతి చెందినట్లు మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Recent Comments