* బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్
రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
దేశంలోని ప్రతి మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్ అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ న్యాయవిజ్ఞాన సదస్సుల భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరు సమానులేని స్త్రీ, పురుషులనే లింగ వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు పనికి తగు వేతనం సమానంగా ఉన్న సమానంగా ఉండాలని ఉన్నారు. ప్రతి మహిళ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి విద్యను అందించాలని అన్నారు. బాల కార్మికులను నిర్మల కోసం మహిళలు నడుము కొట్టాలని అప్పుడే బాల్య నిర్మూలన వ్యవస్థ నిర్మించడం సాధ్యమవుతుందని అన్నారు. బాల్య వివాహాలపై మహిళలకు ముందు సమాచారం ఉంటుందని మీ ఏరియాలో మీ కాలనీలో 18 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే మహిళలందరూ అటువంటి పెళ్లిలని నిరోధం నిర్మించడానికి ముందుకు రావాలి కోరారు. మహిళలు హింసకు సామాజికంగా ఆర్థికంగా వరకట్నానికి వేధింపులకు గురైన , పోకిరిల అకతాయిల నుంచి ఇబ్బందులు ఉంటే వెంటనే 100 ఫోన్ చేయాలని ఉన్నారు. భారతదేశంలో స్వచ్ఛంగా జీవించడానికి భారత రాజ్యాంగం స్వచ్ఛ హక్కు కల్పించిందని స్థానిక ప్రతి ఒక మహిళ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పుట్టిన పాప నుంచి మనిషి చచ్చే వరకు మనిషికి హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు. కలహాలకు తావు లేకుండా స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో మనిషి జీవనం సాగించుకోవడానికి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల ద్వారా మనిషికి మంచి హక్కు కల్పించిందని అన్నారు. తాను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని , తన లాగే కొడుకు కూతురులు నాకంటే మంచి ఉన్నత స్థానమైనటువంటి ఉద్యోగంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులకు కోరిక ఉండాలని అన్నారు. పిల్లలు మంచి స్థాయిలో ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ న్యాయవాది పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్, పిసీ విజయ్, ఐకెపి ఎపిఎం మాధవ్, సి బి ఓ ఆడిటర్ ఆడ్యల గంగాధర్, సీసీలు సంజు, ఎం గంగాధర్, విజయలక్ష్మి, శకుంతల, ఆపరేటర్ అశోక్, జ్యోతి వర్మ, అకౌంటెంట్ సర్వేశ్వర్, కోర్టు సిబ్బంది శశికళ, ఐకెపి వివోఏలు, స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



Recent Comments