రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 2 చిల్కూరి లక్ష్మినగర్ కాలనీ మహిళలు సెల్ టవర్ తొలగించాలని శుక్రవారం రోజున సెల్ టవర్ ఎదుట నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు. అధికారులకు పలుమార్లు విన్నవించిన ఎలాంటి ఫలితం లేదని మహిళలు ఆరోపించారు. గతంలో టవర్ ఒకటి మాత్రమే ఉండేదని ప్రస్తుతం రెండు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ టవర్స్ వలన రేడియేషన్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి టవర్లను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదని మహిళలు వాపోయారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఒక టవర్ ని తొలగొంచాలని ఆదేశాలను జారీ చేసిన అధికారులు బేఖాతారు చేస్తున్నారని వెంటనే టవర్ ను తొలగించాలని ఆ కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
సెల్ టవర్ తొలగించాలని కాలనీ వాసుల ఆందోళన
RELATED ARTICLES
Recent Comments