రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు…..బాధితుడు వేష్కర్ రవికుమార్ ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, బాధితుడు తెలిపిన వివరాలు …
గత నెల 21వ తారీకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయం, ఆదిలాబాద్ సమీపంలో ఒక మహిళ లిఫ్టు కోరగా, తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని ఆమె చెప్పిన ప్రకారం జడ్జి ఇంటి వద్ద గల కైలాష్ నగర్ దగ్గర దింపడం జరిగిందని, ఆ సమయంలో ఆ మహిళ ఆతని ఫోన్ నెంబర్ తీసుకుందని, తర్వాత 23 తారీకున ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన చాకటి కిరణ్ (34) అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి తన మరదలికి ఫోన్లో వేధిస్తున్నావు అని ఆరోపిస్తూ, నీపై ధర్నా చేస్తాము మరియు నీ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాము, అలా చేయకుండా ఉండాలంటే 50 వేల రూపాయలను ఇవ్వాలని, లేనియెడల అతనిపై దాడికి పాల్పడతానని అదేవిధంగా అతని పై అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించగా, భయంతో ఫిర్యాదుదారుడు తన వాహనం ను ఒక వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి 30 వేల రూపాయలను తీసుకొని అదే రోజు సాయంత్రం తనకు అందజేయడం జరిగిందని డబ్బు తీసుకున్న చాకటి కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు.

తదుపరి జరిగిన విషయం కుటుంబ సభ్యులైన తన తండ్రి రిటైర్డ్ ఎస్సై లక్ష్మణ్ కు తెలియజేయగా వెంటనే పోలీసు అధికారులను సంప్రదించి ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈరోజు నిందితున్ని చాకటి కిరణ్ ను అరెస్టు చేయడం జరిగింది అని, రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
బెదిరింపులకు పాల్పడే వారిపై, బెదిరించి డబ్బులు తీసుకుని వ్యక్తులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి సునీల్ కుమార్ హెచ్చరించారు.
లిఫ్ట్ ఇచ్చినందుకు బాధితున్ని వేధించి, చంపేస్తానని బెదిరించి మహిళను వేధించామంటూ ఆరోపణలు చేసి అతని వద్ద నుండి 30,000 రూపాయలను తీసుకున్న నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
బాధితుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగి గా ఉద్యోగం నిర్వహించడం జరుగుతుందని, ఇతని ద్వారా భయభ్రాంతులకు గురై 30 వేల రూపాయలను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
Recent Comments