రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మెన్ తుల అరుణ్ కుమార్ సోమవారం బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామంలో పర్యటించి గ్రామంలోని పేదలను, ఒంటరి వృద్ధులను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆయనను గ్రామంలోని యువకులు ఆహ్వానించగా వారి కోరిక మేరకు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తుల అరుణ్ కుమార్ ను అభినందించారు.
రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని ట్విట్టర్ ద్వారా వినతి
గోకొండ గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి అధిక వర్షాల వలన కొట్టుకుపోయి ప్రమాదకరoగా మారిందని దీంతో విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని R&B శాఖ వారికి తుల అరుణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు. అలాగే లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందజేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత జంగు, మెస్రం భుమన్న, బక్రి రమేష్, గణేష్, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments