రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ: వరంగల్ లో జరిగే విజయ గర్జన సభను విజయవంతం చేయడానికి తెరాస పార్టీ నేతలు శనివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పటు చేశారు.
ఈ సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ పార్టి అధిష్టాన ఆదేశానుసారం , బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచనల మేరకు శనివారం రోజున స్థానిక విట్ఠల్ రెడ్డి గార్డెన్ లో గ్రామ కమిటీ అధ్యక్షులు,అనుబంధ కమిటీ అధ్యక్షులు,మండల కార్యవర్గ సభ్యులు,ఎంపీటీసీలు,సర్పంచులు,నాయకులు కార్యకర్తలతో వచ్చే నెల 15 న వరంగల్ లో విజయగర్జన సభను విజయవంతం చేయాలని సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారూ.
టి.ఆర్.ఎస్ పార్టి ఆవిర్భావించి 20 వసంతాలు పూర్తి చేసుకుని సాధించిన ప్రగతితో వరంగల్ లో నిర్వహించే సభకు గులాబీ చొక్కలు ధరించి పెద్ద మొత్తములో తరలి రావాలని, ఈ బాధ్యతను ఏ గ్రామానికి ఆ గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షులు,స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశములో వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా,అబ్దుల్ రషీద్,హారన్ సుభాష్ పటేల్,ఎంపీటీసీ గాడ్గే సుభాష్,దాసరి భాస్కర్, రాథోడ్ ప్రకాష్, ప్రవీణ్, వెంకటేష్, అజీమ్, పురుషోత్తం రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ నర్వడే రమేష్,షాభిర్,లతీఫ్,గంగ రెడ్డి,గ్యాతం గంగయ్య,సుభాష్ రెడ్డి,సురేందర్ రెడ్డి,భీమ్ రావు, తానజీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Recent Comments