రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో శనివారం రోజు ఇచ్చోడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెరుమాండ్ల నారాయణ మరియు ప్రధాన కార్యదర్శి రేణిగుంట సురేష్ లు మాట్లాడుతూ ఈ డిగ్రీ కళాశాలలో అపారమైన అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారని , కళాశాలకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నదని , స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా ఉన్నదని మరియు DEET ( డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ ) ద్వారా ఉపాధి కల్పిస్తున్నారని తెలియజేశారు.
కళాశాలలో బిఎ, బీకాం ( కంప్యూటర్ అప్లికేషన్స్) బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ( బి జెడ్ సి, బి జెడ్ సి ఎస్ ) బిఎస్సి ఫిజికల్ సైన్సెస్( ఎంపీసీ, ఎంపీసీఎస్ ) కోర్సులు ఉన్నందున బోత్ నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగము చేసుకోవడానికి మరొక్కసారి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఫోర్త్ ఫేస్ ఉన్నందున సుదూర గ్రామాల విద్యార్థినీ విద్యార్థులకు మంచి సదవకాశం కలిగినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ అధిక సంఖ్యలో పొంది విద్యార్థులు వినియోగించుకోగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సలహా సభ్యులు అబ్దుల్ గఫార్, పొనకంటి ఆశన్న, పిల్లి నరేష్, పెరుమాండ్ల స్వామి పాల్గొన్నారు.
Recent Comments