*ఆదిలాబాద్ వన్ టౌన్, బజార్హత్నూర్ నందు కేసుల నమోదు.* *ఆదిలాబాద్ వన్ టౌన్ లో రాథోడ్ సతీష్ అరెస్ట్, బజారత్నూర్ లో సూర్యవంశీ ప్రకాష్ కి నోటీసులు.….
– – ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో వాహనం నంబర్ ప్లేట్లు మార్చి వేరే నెంబర్లు పెట్లతో తిరుగుతున్న ఇద్దరిపై కేసరి నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎస్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రాథోడ్ సతీష్ ద్విచక్ర వాహనానికి తన నెంబర్ కాకుండా బేలాకు సంబంధించిన కారు నెంబర్తో తిరుగుతున్న సందర్భంలో, అతనిపై ట్రాఫిక్ చలాన్లు, జరిమానాలు పడాలని దురుద్దేశంతో నంబర్ ప్లేట్ మార్చడం జరిగిందని తెలిపారు.


అతనిపై Cr.no 121/2025 u/sec 318(4), 336(3) BNS తొ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ నందు సూర్యవంశీ ప్రకాష్ ముత్యంపేటకు సంబంధించిన వ్యక్తి వాహనానికి ఇతర నెంబర్ వేసుకొని నడపడం వల్ల ఇతనిపై కూడాvCr.no 61/2025 u/sec 318(2), 281 BNS తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతని న్యాయస్థానం వద్ద నుండి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి నేరాలు మరెవరు పాల్పడకుండా ఉండాలని సూచించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Recent Comments