*డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన డ్రైవర్.*
*నార్నూర్ ప్రమాద ఘటనపై ఉట్నూర్ ఎఎస్పి కాజల్ ఐపీఎస్ వివరణ.*
*డ్రైవర్ పై కేసు నమోదు, విచారణ కొనసాగుతుంది.*
*ఇప్పటివరకు ఇద్దరు మృతి, 35 మందికి రిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స.*
వివరాలలో :
గుడియత్నూరు మండలం సూర్యగుడకు సంబంధించిన ఆదివాసీలు 50 మంది ఐచర్ వాహనం నందు నార్నూర్ మండలంలోని కప్లే దేవస్థానం కు ఇంటి దేవతల స్నానాల నిమిత్తం బయలుదేరడం జరిగింది. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో నార్నూర్ మండలంలోని మాలేపూర్ గ్రామ శివారులో ఘాట్ సెక్షన్ వద్ద మూలమలుపు తిరుగుచుండగా ఐచర్ బోల్తా పడినది. ఈ ఘటనలో ఐచర్ డ్రైవర్ *కనక శ్రీరామ్* వయస్సు 26 సంవత్సరాలు, పూనగూడ తోషం గ్రామం, గుడియాత్నూర్ మండలం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ ఐపీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 37 మంది ఆదివాసీలు గాయపడగా అందులో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం జరిగిందని తెలిపారు వారి వివరాలు
1) కుమ్ర మాల్కు s/o కేశవరావు, సూర్యగుడ, గుడిహత్నుర్.
2) తుడసం నాగుబాయ్ w/o మారు, సూర్యగుడ గుడిహత్నూ,ర్ మండలం.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై క్రైమ్ నెంబర్ 7/25, u/sec 106(1), 125 (a) బి ఎన్ ఎస్ ఎస్ తో నార్నర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారు రిమ్స్ ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Recent Comments