
రైతు బిడ్డ ఫెర్టిలైజర్ కేంద్రంలో ఒక్క రోజు వ్యధిలో స్టాక్ లేదని బోర్డు… బుక్ చేసుకున్న వారికి దక్కని యూరియా
ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం లోని రైతులకు యూరియా దొరకక రోజుల తరబడి క్యూ లో ఉండాల్సి వస్తుంది. క్యూ లో ఉన్న యూరియా దొరకడం లేదు. Telangana ఫెర్టిలైజర్ యాప్ లో బుక్ చేసినప్పుడు యూరియా స్టాక్ ఉందని బుక్ చేసుకున్న తీర అక్కడికి చేరుకునే సరికి యూరియా లేదని … స్టాక్ మిస్టేక్ చూపెట్టడం జరిగిందని పేర్కొంటున్నారు. అయితే ఇచ్చోడ మండలంలోని రైతుబిడ్డ ఫెర్టిలైజర్ కేంద్రంలో ఈనెల 8 వ తేదీన యూరియా స్టాక్ ఉందని చూపెట్టడంతో బుక్ చేసుకున్న రైతులకు 9 వ తేదీన యూరియా స్టాక్ లేదని వెనక్కి పంపించేశారు.
అయితే రైతులు అటు వ్యవసాయ పనులు చేయాలా.. లేదా రోజు ఇలా మందు షాపుల వద్ద తిరగాల అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Recent Comments