ePaper
Friday, May 15, 2026
📄 ePaper

సాటా ఆధ్వర్యంలో సౌదీ అరబియా రియాద్ లో ఘనంగా ఉగాది మరియు ఈదు మిలాప్ ఉత్సవాలు

📰 Generate e-Paper Clip


హిందుస్థాన్ , సౌదీ అరేబియా ప్రతినిధి : రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది & ఈద్ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులమైన మనకు మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఈ వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అనుభూతిని కలిగించాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత కలిసి ఒకటిగా పాల్గొని ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.



ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య ఆకర్షణలు:
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వినోద కార్యక్రమాలు అందరికీ ఉత్సాహాన్ని నింపాయి.
సమాజ ఐక్యతను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రేరణాత్మక సందేశాలు అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చాయి.



ఈ వేడుకలు కేవలం పండుగకే పరిమితం కాకుండా, రియాద్లోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసేందుకు, ఐక్యతను బలోపేతం చేసేందుకు వేదికగా నిలిచాయి.
వేదికపై పండితులు శ్రీ మురళి  ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం వినిపించడం, అలాగే ఇమామ్ ముజమ్మిల్  ద్వారా ఈద్ మిలాప్ మరియు రంజాన్ మాసం విశిష్టతను వివరణ చేయడం ద్వారా సమాజానికి ఒక గొప్ప సందేశం అందించడం జరిగింది.


సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ
ఈరోజు మనం రెండు గొప్ప పండుగలను కలిసి జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం — ఉగాది మరియు ఈద్ మిలాప్.
ఉగాది అంటే తెలుగు ప్రజల నూతన సంవత్సర ప్రారంభం.


ఉగాది అంటే “యుగాది” — అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ మనకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు ఆనందాన్ని తీసుకరావాలని కోరుకుంటున్నాను.

ఉగాది పచ్చడి లాగా మన జీవితంలో తీపి, చేదు, పులుపు, ఉప్పు అన్నీ ఉంటాయి అని మనకు గుర్తు చేస్తుంది.

అలాగే ఈద్ పండుగ మనకు ప్రేమ, సహనం, దానం మరియు సోదరభావం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రంజాన్ నెలలో ఉపవాసం చేసి, ప్రార్థనలు చేసి, చివరగా ఈద్‌ను ఆనందంగా జరుపుకుంటారు.
ఈ రెండు పండుగలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి.


మతాలు వేరైనా మనం అందరం ఒకటే. ప్రేమ, శాంతి మరియు సోదరభావంతో కలిసి జీవించాలి.
ఈ సందర్భంలో మన అందరం ఒకరికొకరు
ఉగాది శుభాకాంక్షలు మరియు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ,
మన జీవితాలు ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలతో నిండాలని కోరుకుంటున్నాను.
నా విన్నపం ఏంటంటే మన  తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చిన మన సాటా కోర్ టీమ్ సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ముందు ఉంటారని నేను సవినాయంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ  సాటా రియాద్ కోర్ టీమ్కు నా ప్రత్యేకంగా ధన్యవాదములు.

మనము పక్కవాడి గుడిసెను బంగ్లా చేయకపోయినా సరే కానీ ఆ గుడిసెకు నిప్పు పెట్టకపోతే చాలు. మన తెలుగు వాళ్లకు హాని కలిగించ కుండా ఉండమని అని కోరుకుంటూ. మన తెలుగు వాళ్ళు తారస పడినప్పుడు శత్రువుగా చూడకుండా అంటే Who are you అని అనుకుండా How are you అని పలకరించు కుంటే బాగుంటుంది అని కోరుకుంటునాను.



టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు *స్వామి స్వర్ణ* మాట్లాడుతూ, ఒకే వేదికపై *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు* మరియు *ఈద్ మిలాప్* కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా, మతాలు వేర్వేరు అయినప్పటికీ మనమందరం అన్నదమ్ములమే అన్న గొప్ప సందేశాన్ని కార్యరూపంలో చూపించడం అభినందనీయం అని పేర్కొన్నారు.

తెలుగు సంఘాలు వేర్వేరు అయినా, మనమందరం తెలుగు వారమూ, భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్న *శ్రీనివాస్ మచ్చ* గారికి, వారి బృందానికి, అలాగే  సాటా రియాద్ సభ్యులు నిర్వహిస్తున్న అన్ని మంచి కార్యక్రమాలకు టాసా సభ్యులు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

సాటా ఫౌండర్  మల్లేశన్. సాటా రియాద్ కోర్ టీం సభ్యులు, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్,                                                                      ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్,
ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్
మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పదాల తదితరులు తెలుగు ప్రజలకు ఉగాది మరియు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login