Tuesday, October 14, 2025

ఇచ్చోడలో విజృంభిస్తున్నా డెంగ్యూ….. డెంగ్యూ తో ఇద్దరి మృతి….

ఇచ్చోడలో భయపెడుతున్న డెంగ్యూ మరణాలు…

వారం రోజులలోనే ఇద్దరు యువకుల మృతి….

వ్యాధులు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు……

అభివృద్ధి పనులు , పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని వారం రోజుల క్రితమే ఆందోళన చేసిన కాలనీ ఇచ్చోడా వాసులు….

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చొడా మండల కేంద్రంలో డెంగ్యూతో ఇద్దరు యువకులు మృతి చెందారు. దింతో మండల వాసులు తీవ్ర భయాందోళన కు గురవుతున్నారు. ఇచ్చోడా పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిడంతోనే ఇలా మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
♦️ఇటీవల సుభాష్ నగర్ కాలనికి చెందిన యువకుడు డెంగ్యూ బారిన పడీ మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే ,

Thank you for reading this post, don't forget to subscribe!
ఇటీవల డెంగ్యూ తో మృతి చెందిన జగన్ (ఫైల్ ఫోటో )

ఇస్లాంపుర కాలనీకు చెందిన నాఖిబ్ అనే యువ మెకానిక్ డెంగ్యూ తో గురువారం మృతిచెందారు.

డెంగ్యూతో మృతి చెందిన నాఖిబ్ అనే యువకుడు (ఫైల్ ఫొటో)


♦️కాలనీలలో అపరిశుభ్రత,పందుల స్వైర విహారం..!

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు చుట్టూ గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతి గ్రామంలో ఇంట్లో ఒకరు ఇద్దరు మలేరియా , టైపాయిడ్ , డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్నరూ.

తాజాగా ఇచ్చోడా మండల కేంద్రంలోని పలు కాలనీలలో ఇంటికి ఒకరు డెంగ్యూ వ్యాధినా పడుతున్నారు. ఈ వ్యాధి అపరిశుభ్రత వల్ల కాలనీలలో పందులు స్వైర విహారం చేయడం వల్ల వ్యాపిస్తోంది.మండల కేంద్రంలోని కొన్ని కాలనీలు మురికి నీటి గుంటలకు నిలయంగా మారాయి. ఇటీవల కాలనీవాసులు తమ కాలనీలలో రోడ్లు మురికి కాలువల నిర్మాణం గురించి ధర్నా నిర్వహించిన కూడా అధికారుల్లో స్పందన కరువైంది.

ఏ మార్పు లేదని.. దీనిని ఆఫీసర్లు పెడచెవిన పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఎంత చెప్పినా కూడా కొందరు మండల స్థాయి ఆఫీసర్లు పరిశుభ్రత పైన దృష్టి సారించడం లేదు తద్వారా మండల కేంద్రంలో డెంగ్యూ వ్యాధి వ్యాపించి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల సుభాష్ నగర్, ఇస్లాంపూర కాలనీకి చెందిన యువకులు డెంగ్యూ వ్యాధి బారినపడి తనువు చాలించారు. ఇప్పటికైనా ఆఫీసర్లు,ప్రజా ప్రతినిధులు పరిశుభ్రతపై దృష్టి సారిస్తే డెంగ్యూ వ్యాధి వ్యాప్తి అరికట్టవచ్చు.

అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. అనేక మంది టైపాయిడ్ , మలేరియా , డెంగ్యూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల క్రితం ఇచ్చోడ గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత పై ధర్నా చేస్తున్నా ఇచ్చోడా వాసులు…
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!