టేకు చెట్లు నరుకుతూన్న ఇద్దరిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు….
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : అడవిలో టేకు చెట్లు నరుకుతూన్న ఇద్దరిని ఇచ్చోడా అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
కవ్వాల్ టైగర్ రిజర్వజోన్ ఇచ్చోడా రేంజ్ అధికారి వహబ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం…. సీరిచేల్మా పరిధి లోని ఎల్లమ్మ గూడ వద్ద గస్తీ నిర్వహిస్తున్నప్పుడు అడవిలో ఇద్దరు వ్యక్తులు టేకు చెట్లు నరుకుతున్నట్లు ముందస్తు సమాచారం అందింది. చెట్లు నరుకుతున్నట షేక్ మహమూద్ మరియు షేక్ జలీల్ గుండాల వాసులుగా గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చెట్లు నరికివేతకు పాల్పడితే ఎంతటి వారిని కూడా వాదులు ప్రసక్తి లేదనీ అన్నారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ , ఎఫ్ బి ఓలు నితీష్ , జంగులు మరియు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments