- – విచారణ అధికారి సతీష్ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ రంగనాధ్
- – ఎస్పీ సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన డిఐజి కలహాసన్ రెడ్డి
- – బాధితుడు, వైద్యుల నుండి సమగ్ర వివరాలు సేకరణ

నల్లగొండ : దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్.ఐ., కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణ కోసం డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. విచారణ అధికారి సతీష్ చోడగిరి బాధితునితో పాటు చికిత్స చేసిన వైద్యులు, మరికొంత మందిని విచారించిన ఆనంతరం ఎస్.ఐ. తప్పిదం ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో ఎస్.ఐ., కానిస్టేబుల్ లను ఇద్దరిని సస్పెన్షన్ కు సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా ఎస్పీ రంగనాధ్ సిఫార్సు మేరకు హైదరాబాద్ రేంజ్ డిఐజి వి.బి. కమలహాసన్ రెడ్డి వీరిద్దని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments