ఆదిలాబాద్/ బోథ్: బోత్ పట్టణంలో బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గేమింగ్ యాక్ట్ కేసులో పట్టుబడ్డ వారి వివరాలు వార్తాపత్రికల్లో ప్రచురితం కాకుండా చూసేందుకు బాధితుడిని బెదిరిస్తూ రూ.6,000 డిమాండ్ చేసి, అందులో రూ.5,200 వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బోత్ సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ—గత నెల 25వ తేదీన గేమింగ్ యాక్ట్‌లో పట్టుబడ్డ కేసు వివరాలు బయటకు రాకుండా ఉండాలంటూ ఇద్దరు వ్యక్తులు బాధితుడిని బెదిరించారని, మిగిలిన మొత్తానికి కూడా ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. బాధితుడు షేక్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోత్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 308(5) r/w 3(5) కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులుగా తూము సూర్యం, మల్లెపూల గంగన్నలను గుర్తించిన పోలీసులు—బెదిరింపులు, ఎక్స్ట్రాషన్, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ఎవరినైనా చట్టం కఠినంగా ఎదుర్కుంటుందని హెచ్చరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బోత్ ఎస్సై శ్రీ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.
బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments