Friday, November 22, 2024

నిస్వార్ధ సేవకు నిదర్శనం హోంగార్డుల విధులు
   – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

◾️ సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవలందించిన ఇరువురు హోంగార్డులు

◾️హోంగార్డులు ఉద్యోగంలో ఉన్నప్పుడే పెన్షన్ ఆధారిత పథకాలలో చేరాలి

◾️ఇద్దరు హోంగార్డుల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు ఇరువురు హోంగార్డుల పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పదవి విరమణ పొందిన హోంగార్డులు
1) షేక్ రేహమతుల్లా  (hg - 389), 1984వ సంవత్సరంలో రోజుకు పది రూపాయల జీతంతో హోంగార్డుగా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టి 39 సంవత్సరములు తన నిస్వార్థ సేవలను అందించారు.
2) ఎం అశోక్ (hg- 14), 1998 వ సంవత్సరంలో హోంగార్డుగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అడుగుపెట్టి 25 సంవత్సరముల పాటు హోంగార్డుగా విధులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డులు పాత్ర కీలకమని, హోంగార్డులు విధులు నిర్వహించడం నిస్వార్థ సేవకు నిదర్శనమని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డు షేక్ రహమతుల్లాతో ఉన్న అనుబంధాన్ని జిల్లా ఎస్పీ కాసేపు ప్రస్తావించారు. ఉద్యోగంలో చేరినప్పుడు హోంగార్డు రేహమతుల్లా తనకు ప్రతిరోజు భోజనాన్ని అందించే వారిని గుర్తు చేశారు. అదేవిధంగా పదవి విరమణ పొందిన ఇరువురు హోంగార్డులకు పూలమాల, శాలువాతో సత్కరించి బహుమతిని అందజేశారు. హోంగార్డులు ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ ప్రైవేటు పెన్షన్ పథకాలలో చేరాలని తెలిపారు. పదవి విరమణ అనంతరం ఎవరిపై  ఆధారపడకుండా సొంతంగా పెన్షన్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులలో తమకంటూ ప్రత్యేకమైన గౌరవం లభిస్తుందని, ఎటువంటి అవసరాలైనా సులువుగా పూర్తవుతాయని హితవు పలికారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని హోంగార్డులు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి రాములు నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆఫీస్ హెడ్ కానిస్టేబుళ్లు కే రమేష్, అబ్దుల్ మాజీద్, సిబ్బంది జైనులలుద్దీన్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి