రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలో తెరాస గ్రామ కమిటీల ఎంపిక ప్రక్రియ జోరుగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇచ్చోడా తెరాస మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ….
కన్వీనర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి సంస్థాగత ప్రక్రియ జరిగినప్పుడే పార్టి బలోపేతం అవుతుందని,గ్రామ కార్యవర్గాలే పార్టీకి పట్టుకొమ్మలని, ప్రతి టి.ఆర్.ఎస్ కార్యకర్త బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుకు అండగా నిలిచి , కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని అన్నారు.

అధిష్టానం పిలుపు, బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ఆదేశానుసారం,మండల కన్వీనర్ ఆధ్వర్యములో ముఖ్రా (బి ) గ్రామ కమిటీ అధ్యక్షులుగా అడవ్ ప్రహల్లద్ ను , ముఖ్రా (కె) అధ్యక్షులుగా తల్వార్ తిరుపతిని , దేవుల్ నాయక్ తాండ గ్రామ కమిటీ అధ్యక్షులుగా జాధవ్ కృష్ణ నాయక్ ను ఏకిగ్రీవం గా ఎన్నుకున్నారు. అదే విధంగా ఆయా గ్రామాల కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని సన్మానించి నియామక పత్రాలను అందించారూ . కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి , ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్ ముఖ్రా బి సర్పంచ్ మారుతి, డి.సి.ఎమ్.ఎస్ డైరెక్టర్ సురేష్ పటేల్, ముక్ర కె ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దేవుల్ నాయక్ తాండ సర్పంచ్ రాథోడ్ భీమ్ బాయి, సలీమ్,వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, రాథోడ్ ప్రవీణ్, కలీమ్ మరియు టి.ఆర్.ఎస్ కార్యకర్తలు పాల్గొని, సీఎం మరియు గారి కి మద్దతుగా ఉత్సాహంగా తెలంగాణ నినాదాలు చేశారు..
Recent Comments