99% బినామీల పేరిట అద్దె దుకాణాలు… గిరిజన ఆదివాసీలకు దక్కని అవకాశం…
సంవత్సరాల తరబడి అద్దె దుకాణాలలో గొల్ మాల్
టెండర్ రోజు జరిగేది ఒకటి.. తరువాత జరిగే మ్యాజిక్..
పేదలకు దుకాణాలు దక్కకుండా పక్క ప్లాన్ …
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇచ్చోడ కు చెందిన దుకాణ సముదాయాల్లో ఏళ్లుగా ఆదివాసీలకు స్థానం దొరకడం లేదు. టెండర్ కంటే అధికారులు , వ్యాపారుల కుమ్మక్కై దారవత్తు లక్షల్లో పెట్టేస్తారు… దీంతో నిరుపేద గిరిజన ఆదివాసీలు వేలంలో పాల్గొనకుండా చేస్తున్నారు. వేలంలో ఉదాహరణలు ₹200000 వెలకు వేలం పాట పాడి అద్దె భవనంలో ( శెట్టర్) దక్కించుకుని ఆ తరువాత మాములుగా ఏం జరుగుతుందో తెలియదు గాని … అందరికీ ఒకే ధర అంటూ ₹5000 అద్దె వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో సగం అధికారుల జేబుల్లో , సగం పాఠశాలకు డబ్బు వెళ్తుందని బయట ప్రచారం.
వాస్తవానికి వేలం పాటలో నెలకు లక్ష రూపాయల అద్దె వేలం పాడడానికి కూడా వెనకడుగు వేయరు ఎందుకంటే తరువాత అంత సెట్ చేసుకుంటారు కాబట్టి.. అయితే ఇక్కడ వేలంలో సెట్టర్లు ( దుకాణాలు ) దక్కించుకున్న వారిలో కేవలం 5 నుండి 6 గురు మాత్రమే స్వతహాగా వ్యాపారం చేస్తున్నారు. మిగతా వారు అధిక అద్దె కు యితరులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో నెలనెలా ఎంతో కొంత పాఠశాల అధికారులకు మ్యనేజ్ చేయడం కోసం ఇస్తున్నట్లు సమాచారం . ఏదేమైనా జిల్లా కలెక్టర్ ఏజెన్సీ చట్టాల పై , గిరిజన ఆదివాసీల హక్కుల పై కఠినంగా వ్యహరిస్తున్న వేళ ఇక్కడ నిరుపేద గిరిజన ఆదివాసీలకు వ్యాపారం చేసుకునే అవకాశం దొరుకుతుందా అనేది వేచి చూడాలి..
Recent Comments