epaper
Saturday, January 24, 2026

చింతల సాంగ్విలో సిడం వంశీయుల నోవోంగ్ పూజలు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం లోని చింతల సాంగ్వీ గ్రామంలో సిడాం వంశియులు సోమవారం రోజు నోవోంగ్ పుజలు  నిర్వహించారు. నోవోంగ్ అనగా కొత్తగా వేసిన పంటలు అయిన కూరగాయలు , దాన్యాలు , పండ్లలను, పంటలను పేర్స పేన్,సతిక్ పేన్,వన దేవతల ముందు ఉంచి పూజిస్తారు.


సామల బియ్యం, నెయ్యి తో నైవెద్యం వండి దేవతలకు సమర్పిస్తారు. ఆ నైవెద్యంను సిడాం వంశీయులు మాత్రమే తింటారు.మిగితా అన్నం,పప్పు, పిండి వంటలను వండి ఉరివాళ్ళకు అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు .నాటి నుంచి పంట పోలాలలో పండిన పంటను, కూరగాయలు తినడం ప్రారంభిస్తార.  అంతకు ముందు తినకుండా ఉంటారు.

పూజలు నిర్వహిస్తున్న దృశ్యం


ఈ నొవోంగ్ పూజలను ప్రతి గిరిజన గ్రామంలో అనాది కాలం నుంచి ఆచారంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సిడాం సుబాష్, భీంరావ్,హన్మంతు, రమేష్, దేవురావ్,తుకారాం, సిడాం వంశియ మహిళలందరు పాల్గోన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!