*50 సీసీ కెమెరాలు ప్రారంభం
*కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఐటీడీఏ పీఓ
*సీసీటీవీ నిఘా నీడలో ఉట్నూర్ మరియు ఇంద్రవెల్లి మండల కేంద్రాలు
*ఉట్నూరు పోలీస్ స్టేషన్ నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ, ఐటిడిఏ పిఓ, ఏఎస్పి ఉట్నూర్
*30 రోజుల బ్యాక్అప్ తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
*నిష్ణాతులైన సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
ఆదిలాబాద్ : నేరాల నియంత్రణ మరియు నేరాలను అరికట్టడానికి ఉట్నూర్ మరియు ఇంద్రవెల్లి మండల కేంద్రాలలో 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈరోజు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఐఏఎస్ మరియు ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ కలిసి ప్రారంభించారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుందని ఎలాంటి సమస్యలనైనా ఛేదించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు. ఉట్నూర్ నందు ప్రారంభించిన కమాండ్ కంట్రోల్స్ సెంటర్లో ఉట్నూరు నందు 37 సీసీటీవీ కెమెరాలు మరియు ఇంద్రవెల్లి నందు 13 సీసీటీవీ కెమెరాలతో ప్రధానమైన కూడళ్లను సీసీటీవీ నిఘానేత్రంలో ఉండి, నిష్ణాతులైన సిబ్బందిచే 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రారంభించిన సిటీ కెమెరాలు అధునాతన టెక్నాలజీని సాంకేతికతను కలిగి ఉన్నాయని రాత్రి సమయంలో, పగటి సమయంలో తేడా లేకుండా సరైన స్పష్టమైన దృశ్యాలను చూపిస్తుందని, 30 రోజుల బ్యాక్అప్ తో కలిగిన వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ సీసీటీవీ కెమెరాలకు సహకరించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఐఏఎస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసుల ఖిల్లా ఉండేటువంటి ఉట్నూర్ ఇంద్రవెల్లిలలో ఎలాంటి నేరాలకు ఆస్కారం లేకుండా నేరస్తులను త్వరితగతిన పట్టుకునేందుకు మరియు దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కారకులను గుర్తించడంలో ఈ సీసీటీవీ కెమెరాలు తమ వంతు కీలక పాత్ర పోషిస్తూ కేసు చేతనలో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సిఐ మడవి ప్రసాద్, నార్నూర్ సీఐ పి ప్రభాకర్, ఎస్సైలు కె ప్రవీణ్, అఖిల్, మనోహర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments