మావల పోలీస్ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్
నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు
ఆదిలాబాద్ : మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం బట్టబయలు అయింది.
ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను మావల పోలీసులు బట్టబయలు చేశారు.
అరెస్టైన నిందితులు:
నానం వెంకటరమణ (60) – RWS D.E.E., టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్
ఉష్కం @ ఉష్క మల్ల రఘుపతి (43) – మావల, ఆదిలాబాద్
బెజ్జవార్ సంజీవ్‌కుమార్ (49) – ప్రభుత్వ ఉద్యోగి, ఆయుష్ విభాగం, రిమ్స్ ఆదిలాబాద్
పరారీలో ఉన్నవారు:
దుప్పలపూడి అశోక్ – సబ్ రిజిస్ట్రార్
కుంభకోణం ఎలా జరిగిందంటే?
బాధితుడు మిల్లింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది.
నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు.
సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు ₹7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు.
సుమారు ₹2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ.
మావల సీఐ కర్ర స్వామి దర్యాప్తులో భాగంగా నిందితుల పై సెక్షన్లు IPC 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు
పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ పై కూడా కేసు నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments