*కానిస్టేబుల్ అంతః క్రియలలో పాల్గొని, పార్థివ దేహానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ*
*2012 బ్యాచ్ కానిస్టేబుల్ “రాథోడ్ విలాస్” గుండెపోటుతో హఠాత్ మరణం.*
*ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు.*
*తక్షణ సహాయర్థం అంతః క్రియల కై కుటుంబ సభ్యులకు 30 వేలు అందజేత.*
ఆదిలాబాద్ : బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, జిల్లా పోలీసు వ్యవస్థకు కానిస్టేబుల్ మరణం తీరని లోటుని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు వదిలిన నిర్వర్తిస్తున్నటువంటి 2012 బ్యాచ్ కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(35) కు ఈరోజు ఉదయం ఇచ్చోడ లో మన స్వగృహం నందు గుండెపోటు రావడంతో, ఇచ్చోడ నుండి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో హాస్పిటల్ నందు పరమపదించడం జరిగింది.



ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే తన స్వగ్రామం సోనాల మండలం సంపత్ నాయక్ తండ నందు జరుగుతున్న అంతః క్రియలలో పాల్గొని కానిస్టేబుల్ పార్తివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. స్వర్గస్తులైన కానిస్టేబుల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తక్షణ సహాయర్థం అంతః క్రియల ఖర్చులకై కుటుంబ సభ్యులకు 30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుల్ మరణం తీరని లోటుని, బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు డి గురు స్వామి, ఎం ప్రసాద్, ఎస్సైలు సాయన్న, సంజయ్ కుమార్, శ్రీ సాయి, పోలీసు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిన్నెల సత్యనారాయణ, తోటి పోలీసు మిత్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments