చిరుత దాడిలో ఒక ఆవు మృతి
రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హత్నూర్ :
మండలంలోని భూతాయి( బి ) గ్రామ శివరాం లో చాటే గోవింద్ రైతు చెనులో న్న పశువుల పాక ఆవరణలో కట్టి ఉన్న ఆవుల పై మంగళవారం అర్ద రాత్రి 12 గంటల సమయం లో చిరుత దాడి చేసి ఒక అవును చంపేసింది. ఇంకో అవు కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఆవు పరిస్థితి కూడా విషమం గా ఉంది.
సంబంధిత అధికారి బీట్ ఆఫీసర్ ప్రితమ్ సంఘటన స్థలానికి వెళ్లి . చిరుత పాద ముద్రలు పరిశీలించారు. ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించి దాడి చేసిన జంతువును నిర్దారిస్తారు అని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో పశువులను ఎవ్వరు కట్టకుండా జాగ్రత పడాలి అని సూచించారు.
తమను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు . పశువుల కాపరులు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసారు..సంఘటన జరిగిన ఫారెస్టు ఏరియా బరంపూర్ నార్త్ బెట్ అదేవిదంగా రేంజ్ ఆఫీస్ ఇచ్చోడా పరిధిలో వస్తుందని తెలిపారు. శాఖపరంగా సదరు రైతుకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతు చెనులో జరిగిన సంఘటన స్థలానికి గ్రామ సర్పంచ్ ఫడ్ ఙ్ఞానేశ్వర్ కార్యదర్శి శ్రీకాంత్ కిషన్ ఫారెస్ట్ అధికారులు వెళ్లి పరిశీలించారు.


Recent Comments