పండుగపుట సిరిచేల్మా లో విషాదం ….
అధికారుల నిర్లక్ష్యం వల్లే అని గ్రామస్తుల ఆరోపణల….
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండలం లోని సీరిచేల్మా గ్రామంలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. సీరిచేల్మా గ్రామానికి చెందిన ఏరేకర్ శంకర్ మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు క్రాంతి (10) మూడో తరగతి చదువుతున్నాడు. ఏడు రోజుల క్రితం ఇంటి నుండి పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యలో పిచ్చి కుక్క దాడి చేసి కరిచింది. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన క్రాంతి ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ని నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్సకోసం తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం 6 గంటలకు ఆ బాలుడు మృతి చెందాడు.
ఈ సంఘటన తో పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామంలో ఉన్న వందల కుక్కల్లో ఏ కుక్క మంచిదో ఏది పిచ్చి కుక్కనో తెలియక గ్రామ ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయాందోళన చెందుతున్నారు. బాలుడు మృతి కి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు.


Recent Comments