రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
*మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, బంధించి, మాన భంగం చేసిన వ్యక్తికి పది సంవత్సరాల జైలు మరియు 3 వేల రూపాయల జరిమానా విధిస్తూ పొక్సో కోర్టు న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వేలువరించారు.
కేసు వివరాలలోకి వెళితే…..
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలిక (16) ఐదవ తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతు ఉండగా ఆదిలాబాద్ పట్టణ కేంద్రం లోని ఖానాపూర్ కి చెందిన నేరస్తుడు లంక రాకేష్ (23) అనే వ్యక్తి ఆ బాలికను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయితో చనువు పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లొంగదిసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయిని 2019 జులై 27 వ తేదిన 11 గంటలకు తీసుకొని వెళ్లి సాత్నాలా లోని రామాలయం వద్ద పసుపు తాడు మెడలో వేసి అక్కడే పక్కన గల షెడ్డులో ఉంచి మూడు రోజులుగా బలవంతంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. మూడు రోజులుగా కూతురు కనిపియ్యాక పోవడం తో బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తల్లి దరఖాస్తు మేరకు ఎస్సై గుణవంతరావు సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసుకోగ , అమ్మాయి స్టేట్మెంట్ మేరకు సెక్షన్ 363 తో పాటుగా 347 ipc,372 (2)(n) IPC & 6 పొక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేయగా, డిఎస్పి లు బి డేవిడ్ ఏసుదాస్, ఎన్ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించినారు.
ఈ కేసులో సిడిఓ టి రవీందర్ సింగ్ సాక్షులను ప్రవేశపెట్టగా ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి 16 సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా శుక్రవారం పోక్సో కోర్ట్ న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరిస్తూ వివిధ సెక్షన్ల కింద సెక్షన్ 6 పొక్సో చట్టం కింద నేరస్తుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు 2 వేల రూపాయల జరిమానా విధించారు. నేరస్తుడు జరిమానా కట్టని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష, 363 కింద రెండు సంవత్సరముల సాధారణ జైలు రూ.1000 ల జరిమానా 342 కింద ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ అన్ని కేసులు ఏకకాలంలో అమలు కావాలని ఆదేశించారు. కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా కోర్టులో వాదించిన పిపి ముసుకు రమణారెడ్డి మరియు కోర్టు డ్యూటీ అధికారి టి రవీందర్ సింగ్, లైసన్ అధికారి ఎం గంగా సింగ్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments