హోల్ సెల్ వైన్స్ షాప్ అంటూ..
శివ శక్తి వైన్స్ షాప్ మాయాజాలం…
ఒక్కటి కొంటె ఇవ్వరూ…..
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ :
హోల్ సెల్ కిరాణా షాపులు… హోల్ సెల్ బట్టల దుకాణాలు… హోల్ సెల్ స్టీల్ సామగ్రి దుకాణాలు పేర్లు విన్నాం.. హోల్ సెల్ వైన్స్ షాప్ పేరు ఎక్కడైనా విన్నామా..!? విని ఉండం కదా.. కానీ ఇచ్చోడ మండలంలో శివ శక్తి హోల్ సెల్ వైన్స్ షాప్ మాయాజాలం మద్యం ప్రియులకు చుక్కలు చూపుతోంది. ఆ కథ కమీసు ఏంటో వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలంలోని అడేగామా కే గ్రామంలో నాలుగు మద్యం వైన్స్ షాపులు ఉన్నాయి. మూడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి. ఒక్కటి మాత్రం నిబంధనలు పాటించకుండా ఎక్సయిజ్ ఆదేశాలను తుంగలో తొక్కింది. ఇక్కడ మద్యం ప్రియులకు చల్లటి బీర్లు, విస్కీ లు లభించవు. ఒక్కటి కొంటె ఇవ్వరు. కొంటె అయిదు, లేదా పది పైనే కొంటేనే ఇస్తారు. అది కూడా గరం గరం బీర్లు. ఇదేమీ అని మద్యం ప్రియులు ప్రశ్నిస్తే నీ ఇష్టం కొంటె కొను, లేకుంటే పక్క షాప్, అక్కడ లేకుంటే రోడ్డు మీద షాప్ లో వెళ్లి తీసుకో అంటూ వెటకారంగా మాట్లాడుతూ సమాధానం ఇస్తున్నారనీ మధ్యం ప్రియులు వాపోతున్నారు.
ఈ షాప్ లో ఎలాంటి ఫ్రిజ్, ర్యాక్ లు, కౌంటర్ లేవు. పక్కన పర్మిట్ రూమ్ లేదు. పెద్ద గోదాం ఏర్పాటు చేసారు.
ఎలాంటి తనిఖీలు లేవు…
శివ శక్తి వైన్స్ షాప్ మొదటి నుంచి వివాదంగా మారింది. హోల్ సేల్ వైన్స్ షాప్ అంటూ ప్రతి బీరు, ఇతర విస్కీ లపై రూపాయలు 5 చొప్పున అధిక ధరలకు విక్రయించారు. దీనిపై కొందరు మద్యం ప్రియులు ఎక్సయిజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. పత్రికల్లో వస్తే ఆఘమేఘాల మీద వెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. హోల్ సెల్ వైన్స్ అని మీకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ లైసెన్స్ దారుడిపై మండిపడ్డారు. ఫ్రిజ్, ర్యాక్ లు ఏర్పాటు చేసుకుని, చల్లటి బీర్లు అందుబాటులో ఉంచాలని, ఒక్క బాటిల్ అడిగితే కూడా ఇవ్వాలని అధికారులు ఆదేశించారు
.
*అధికారుల ఆదేశాల బేఖాతరు చేస్తూ*
యథేచ్ఛగా హోల్ సెల్ గా విక్రయాలు..
ఈ వైన్స్ షాప్ కూ వెళ్తున్న మద్యం ప్రియులకు నేటికి కూడా ఒకటి చొప్పున విస్కీ, బీరు ఇవ్వడం లేదు. మాది హోల్ సెల్ వైన్స్ షాప్.. ఇక్కడ నుంచే అన్ని వైన్స్ షాప్ లకు మేమె మద్యం సరఫరా చేస్తాం.. మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి.. ర్యాక్ లు పెట్టం.. ప్రిజ్ పెట్టం.. చల్లటి బీర్లు ఉంచం… మీ ఇష్టం కొంటె కొంటె అయిదు.., పది ఇస్తాం.. లేదంటే పక్క షాప్ కూ వెళ్ళండి మేమంతా సిండికేటుగా మారాం. మాకేమీ కాదు అంటూ ఇస్తానుసారాంగా మాట్లాడున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటేనే వీరి ఆగడాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని వారు అంటున్నారు. ఈ హోల్ సెల్ వైన్ షాప్ పై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని మద్యం ప్రియులు హెచ్చరిస్తున్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments