— సైబర్ నేరాల పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
— సైబర్ నేరానికి గురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని సూచన
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు 75వ ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై అవగాహన తో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి సైబర్ నేరాలపై అయినా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో చక్కటి సైబర్ బృందం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలకు గురైనట్లు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేస్తే లేదా ప్రభుత్వ వెబ్ సైట్ అయిన *www.cybercrime.gov.in* కు సంప్రదించవచ్చని తెలిపారు. ఇలా చేయడం వల్ల తాము కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని వెంటనే ఆపగలిగి, సైబర్ నేరగాళ్లను అడ్డుకునే ఒక వ్యవస్థ ఉందనీ, తాము కోల్పోయిన డబ్బును తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ బ్లాక్ వెబ్ సైట్ లను, తమకు లక్కీ స్కీమ్ లో డబ్బులు వచ్చాయి అని నమ్మబలికే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, తక్కువ ధరకే కొత్త వాహనాలను అందిస్తామని వ్యక్తుల మాటలు నమ్మి మోస పోకూడదని ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షీ టీమ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ లు పి సురేందర్, కే శ్రీధర్, కే మల్లేష్, ఈ చంద్రమౌళి, జె కృష్ణమూర్తి, జె గుణవంత రావు, ఎస్సై అన్వర్ ఉల్ హక్, ఐటీ సెల్ ఇంచార్జ్ సింగజ్ వార్ సంజీవ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments