Thursday, November 21, 2024

దేశంలో ఘనంగా తీజ్ పండుగ….

తొమ్మిది రోజులపాటు జరిగే తీజ్ వేడుకల పై ప్రత్యేక కథనం…..

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఎడిటోరియల్ న్యూస్:

తీజ్ పండుగ అంటేనే బంజారాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుంది. ఈ పండుగ ప్రారంభించడానికి ముందు బంజారాల గ్రామాల్లో , తండాల్లో ఆడపిల్లలంతా కలిసి ఇంటింటికీ తిరిగి గ్రామంలో ని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు . ఉత్సవాలు నిర్వహించడానికి ఊరి పెద్ద నాయక్ , కార్బారిలా చర్చించి పండుగను ప్రారంభిస్తారు . శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు పండుగ ప్రారంభం అవుతుంది . మొత్తం తొమ్మిది రోజులపాటు పండుగ వేడుకలు జరుపుకుంటారు . ముందుగా ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు , శనగలు , ఇతర సామాగ్రి సమకూరుస్తారు .

ఆడపిల్లల కోసం వారి సోదరులు ఇంటి వద్దనే బుట్టలను అల్లుతారు . దీనికి అడవి లో దొరికే దుసేరు తీగను తీసుకొచ్చి , పుట్టమట్టి సేకరించి తెచ్చి అందులో తుల్జాభవాని , దండియాడి , సేవాబాయా , సీతలా భవాని పేర్లతో బట్టలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన బుట్టల్లో మొదటగా తండా నాయకుడితో పుట్టమట్టిని బుట్టలలో వేయిస్తారు . ఆ తర్వా త నానబెట్టిన గోధుమగింజలు ఆ బుట్టలో చల్లిస్తారు .ఈ సందర్భంగా ” శీతా యాడి పరాయి తీజ్ , బాయీ తారో పాలేణా .. నెరో డాక్లో ఘలాన , బాయీ తారో పాలేణా” అనే పాటలు పాడు తూ పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు .

తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో ప్రతి యువతి ఎవరి బుట్టలో వారు ప్రతిరోజూ ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం నీళ్లు పోస్తారు.

ఈ పూజలో ప్రత్యేకంగా బోరడి ఝష్కేరో కార్యక్రమం తీజ్ పండుగలోనే హైలైట్ . బోర్ అంటే రేగుముళ్లు, ఝష్కేరో అంటే గుచ్చడమని అర్ధము.

నానబెట్టిన శనగలకు రేగు ముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరుడి జస్కెరో అని అంటారు.

గోధుమలను బుట్టల్లో చల్లే రోజున సాయంత్రం పూట బోరడిఝ ష్కేరోని నిర్వహిస్తారు . సుఖదుఃఖాలు భరించేలా జీవితంలో ఏ విధంగా సమాజానికి అనుగుణంగా నడుచుకోవాలో నేర్చుకోవచ్చు.

ఈ వేడుకలో ముఖ్యంగా అబ్బాయిని డోక్రా (ముసలివాడు) అనీ , అమ్మాయిని డోక్రి (ముసలిదని) అని పిలుస్తారు .

పెండ్లికాని ఆడపిల్లలు పెండ్లి తర్వాత తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని దుఖంతో ఏడుస్తారు . వారిని ఓదార్చుతూ సోదరులు , బావలు ఆటపట్టిస్తారు .

చివరి రోజైన తొమ్మిదో రోజు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు…..

ఒల్ది (బుట్ట) లో పెరిగిన నారును ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు .

ఓ గ్రామంలో వేడుకల కోసం బంజారాల వస్త్రాలంకరణతో చిన్నారి…

దేశవ్యాప్తంగా తీజ్ ఉత్సవాలు….

దేశ వ్యాప్తంగా తీజ్ పండుగను వేరు వేరు ప్రదేశాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. విశేషమేమంటే ఈ పండుగను నేపాల్ దేశం లో జరుపుకోవడం విశేషం. ఉత్తర భారతదేశంలో తీజ్ పండుగను హరియాలీ తీజ్ అని అంటారు . పూర్వికులు చెప్పే విషయాల ప్రకారం శివపార్వతుల ప్రేమకు సంకేతంగా కూడా ఈ వేడుకలు జరుపుతున్నారు అని అంటారు . శివుని ఆశీర్వాదం పొందేందుకు పార్వతీదేవీ నూట తొమ్మిది సంవత్సరాలు ఉపవాస దీక్ష చేసిందనీ పూర్వికులు చెబుతారు. పార్వతి దేవిని పెళ్లి చేసుకుంటానని శివుడు హామీ ఇచ్చిన తర్వాత దీక్షను విరమించిందనీ చెబుతారు . అందుకే పార్వతి దేవిని భవాని దేవిని పిలుస్తారూ. తీజ్ పండగ వేడుకలు గోర్ బంజారాలు పూజించే ఏడూ ( సాత్) ( 7 ) భవానీలను పూజించడం తో మొదలు అయింది .

ఏడూ యాడిలలో మెరామా యాడి ( మరియమ్మ) యొక్క గుడిని ప్రతి గ్రామంలో నిర్మించారు. సేవాలాల్ మహరాజ్ , మరియమ్మ యాడి మందిరం , హనుమాన్ మందిరం ప్రతి తండాల్లో ఉంటుంది. ఈ విధంగా బంజారాల సమాజం ప్రజలు ఆధ్యాత్మిక త ను చాటుకుంటున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి