అదిలాబాద్: స్వామి వివేకానంద జయంతి మరియు యువజన దినోత్సవ సందర్భంగా హార్ట్ టెక్, ఆరోగ్యజ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ కి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, స్వచ్ఛంద సేవకులు మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.


ఆరోగ్యజ్యోతి మరియు హార్టెక్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సేవలందించడంలో ప్రతి యువత ముందుకు రావాలని తెలిపారు స్వచ్ఛంద సేవా సంస్థలతోపాటు యువకులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే సేవా కార్యక్రమాలు మరింత మెరుగుపడతాయని భక్తుల పేర్కొన్నారు. సేవ అందించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని తెలిపారు. సేవ చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్,శ్రావణ్ నాయక్,
వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు యువజన సంఘాల నాయకులు ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments