Friday, November 22, 2024

గెలిస్తే అన్ని రంగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ది చేస్తా

ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థి సుభాష్ రాథోడ్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/గాదిగూడా / తాడి హత్నూర్ / బేలా :

ఎంపి అభ్యర్థి గా గెలిచి జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర ఎంపి అభ్యర్థి మాజీ బిజేపి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు సుభాష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లాలో బెల , పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. వారు సొంత ప్రయెజనాలు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదని అన్నారు. స్వాతంత్ర్యం 70 ఏళ్లకు పైగా అవుతున్న ఇప్పటికి మట్టి రోడ్లు కూడా లేని గ్రామాలు ఉన్నాయనీ అన్నారు. తాను గెలిచిన వెంటనే ముందుగా గ్రామాలకు రోడ్ల సౌకర్యం కోసం ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అన్నారు.
పాత నాయకులకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన లాభం లేదని వారి వల్ల ఏమీజరగదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద ప్రాజెక్టు అంటూ జిల్లాకు ఏమి తీసుఖరాలేదని అన్నారు. గ్రామాల్లో వర్షాకాలంలో ఉండే పరిస్థితి చూసి ఓటు వేయాలని అన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పి నాయకుల కోసం ఓటు అడిగే కొంతమంది నాయకులు ఎన్నికలు కాగానే ఐదేళ్లు కనిపియకుండ పోతారని అన్నారు. తన స్వార్థం కోసం పార్టీలు మారే వారు ఇప్పుడు కూడా పార్టీలు మారరని గ్యారెంటీ ఏమిటని అన్నారు. ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలో దూకే నాయకుల వల్ల అభివ్రుద్ది కాదనీ , స్వార్థం కోసం పదవీ కోసం పార్టీలు మారుతారని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గెలిచిన వెంటనే జిల్లా పరిస్థితి వివరించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు.

అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి లక్షలు నిధులు తీసుకొచ్చి ధర్మం కోసం కూడా పనిచేస్తానని అన్నారు. గుళ్ళకి చందాలు చేసే కంటే హక్కుగా వచ్చే ప్రభుత్వ నిధుల ద్వారా అభివ్రుద్ది చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పెద్దలు తదితరులు పాల్గోన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి