* ఇచ్చోడ మండలం ముక్రా – బి లో జరిగిన ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు
* సోషల్ మీడియా నందు దుష్ప్రచారం చేసిన వారిపై ప్రత్యేక బృందం ద్వారా నిఘా
*బావిలో ఈతకు వెళ్లి మరణించిన వ్యక్తి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శనివారం ఇచ్చోడ మండలం ముక్రా బి గ్రామం నందు 8 మంది యువకులు ఈతకు వెళ్లగా అందులో ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఈ సంఘటన నందు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని ఇచ్చోడ సిఐ బండారి రాజు తెలియజేశారు.
ఈ సంఘటనపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా నందు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వాట్సాప్ నందు షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని వాట్సప్ అడ్మిన్లు విషయాన్ని గమనిస్తూ ఉండాలని ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారి సందేశాలను వెంటనే తొలగించాలని సూచించారు.
Recent Comments