*జందాపూర్ నందు జరిగిన ఘటనపై నిందితురాలిపై కేసు నమోదు
*సోషల్ మీడియా నందు విద్వేషాలు రెచ్చగొట్టేలా, దుష్ప్రచారం చేసేలా పోస్టులు చేసిన వారిపై, వాట్సాప్ గ్రూపు యజమానులపై చర్యలు తప్పవు, ప్రత్యేక బృందం ద్వారా నిఘా
*నిందితురాలి పై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు
ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 23 : ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జందాపూర్ గ్రామం నందు ప్రమాదవశాతూ వాహనం తో జరిగిన ఘటనపై నిందితురాలిపై రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. ఈ సంఘటనపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియా నందు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన, వాట్సాప్ నందు షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని, వాట్సప్ అడ్మిన్లు విషయాన్ని గమనిస్తూ ఉండాలని ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించే లా ఉండే వారి సందేశాలను వెంటనే తొలగించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకుంటూ వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళపై శాఖా పరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. మహిళకు సంబంధించినటువంటి వీడియోలను ఎటువంటి వాట్సప్ గ్రూపులను ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని, ఇతర మతాలను కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల సంయమనం పాటించాలని ఎలాంటి పుకార్లను వదంతులను నమ్మకుండా ఉండాలని సూచించారు.
ఫార్వర్డ్ మెసేజ్లు ఆధారంగా జందాపూర్ కి వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉన్నటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Recent Comments