*ఫేక్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముగ్గురి పై కేసు నమోదు.*
వివరాలు వెల్లడించిన పోలీసు ఉన్నతధికారులు
తేదీ 19.03.2024 న ఊట్నూర్లో SSC ఉర్దూ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది దీని గురించి విచారణ చేయగా మమ్మద్ ముబాషిర్ అను అతను గతంలో టీఎంఆర్ఎస్ ఉట్నూరు యందు పనిచేసేవాదు. అక్కడ నాన్ టీచింగ్ సిబ్బందితో సరిగ్గా పడకపోవడం వల్ల అతని తీరు వారితో సరిగా లేకపోవడం వల్ల అతన్ని ఇచ్చోడకు బదిలీ చేయగా అతనికి ఇచ్చోడకి వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. తర్వాత కొన్ని రొజులకు అతను ఇక్కడే ఏకలవ్య స్కూల్ యందు మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగం వెతుకొని అక్కడ పనిచేస్తున్నాడు. TMRS స్కూల్ నుండి ఇచ్చోడకి బదిలి వ్యవహారంలో TMRS ఉట్నూరు స్కూలు యొక్క ప్రిన్సిపల్ అయిన T వెంకట ప్రసాద్ కారణం అన్న కోపంతో అతన్ని ఏ విధంగానైనా అతని తప్పులు వెతికి బదనాము (blame) చేయాలనే ఉద్దేశంతో ఎదురు చుస్తున్నాడు.
తేదీ 19 3 2024 న మోబషీర్ మరియు ఆసిఫ్ కలిసి ప్లాన్ చేసుకొని ఉర్దూ పేపర్ కి సంబంధించి TMRS ఉట్నూరు యందు పనిచేసే అబ్దుల్ సమీ టీచర్ ఇంటికి సయ్యద్ కైఫ్ అను అతనిని పంపించి శమీ యొక్క వీడియోలు ఫోటోలు తీసి పంపించమని చెప్పినారు. అదే మాదిరిగా సయ్యద్ కైఫ్ అనే వ్యక్తి షాబాద్ అను మరొక్క వ్యక్తిని తోడుగా తీసుకొని శమీ టీచర్ ఇంటికి సుమారు 10:30 AM సమయంలో వెళ్లగా ఆ సమయంలో శమి గ్రామర్ కు సంబంధించి నోట్స్ ను ఒక తెల్లని కాగితంపై రాసుకుంటుండగా శమీ యొక్క వీడియో మరియు ఫోటోలు కైఫ్ తీసి వాటిని వాట్సాప్ ద్వారా ముబాషిర్ కు పంపించినాడు. తర్వాత ముబాసిర్ ఫోన్ ద్వారా శమి కి ఫోన్ చేసి మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా అని గుచ్చి గుచ్చి అడగగా అవును జరుగుతుంది ZPHS నుండి పేపర్ వచ్చింది మరల జవాబులు తయారుచేసి పంపించాము అని అసహనము తొ అనగా అట్టి మాట్లాడిన వాయిస్ రికార్డ్ ని రికార్డ్ చేసి అట్టి వీడియోలు మరియు ఫోన్ కాల్ రికార్డును వాట్సాప్ ద్వారా కాగజ్ నగర్ లో ఉన్న మహమ్మద్ ఆసిఫ్ కి పంపినాడు. (శమీ అను వ్యక్తి ముబాషిర్ కి గతంలో TMRS యందు పనిచేస్తున్న సమయంలో తోటి ఉద్యోగి అవడం వల్ల తరచుగా వెంకటప్రసాద్ ఏమైనా తప్పులు చేస్తున్నాడని అడుగుతూ ఉండేవాడు)
మహ్మద్ ఆసిఫ్ కాగజ్ నగర్ చెందిన వ్యక్తి కూడా గతంలో TMRS కాగజ్ నగర్ యందు నాన్ టీచింగ్ స్టాఫ్ క్లారికల్ గా పనిచేశాడు. అతను ఉద్యోగం విధులు సరిగా లేకపోవడం వల్ల అప్పుడు అక్కడ పని చేసిన ఇట్టీ T. వెంకటప్రసాద్ అను ప్రిన్సిపల్ యొక్క రిపోర్ట్ ఆదారంగా అతన్ని విధుల నుండి తొలగించినాడు.
కాగజ్ నగర్ లో ఉన్న Md అసిఫ్ మరియు ఉట్నూర్లో ఉన్నా ముబాషిర్ లు ఇద్దరు కూడా ఈ ప్రిన్సిపాల్ అయిన వెంకటప్రసాద్ వల్లనె ఉద్యోగం పోయి, ఇబ్బంది పడుతున్నామన్న కోపంతో అతనిని ఏదో రకంగా ఇబ్బంది/Blame చెయాలనె ఉద్దేశంతో వీరిద్దరూ మరియు కైఫ్ సహాయాన్ని తీసుకొని ఈ విధంగా నిర్ణయించుకొని ఈ వీడియోలు ఫోటోలు రికార్డింగు లను ఆధారంగా SSC ఉర్దూ పేపర్ లీకేజీ /mass copying అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. సమీ ఇంటిలో రాస్తున్న గ్రామర్ కి ఉర్దూ ప్రశ్నపత్రానికి కి ఎలాంటి సంబంధం లేదు. ఆసిఫ్ మరియు ముబాషిర్ లు ఇద్దరు వెంకటప్రసాద్ పై వ్యక్తిగత పగలను తీర్చుకునేందుకు, blame చేయడానికి fake వాయిస్ కాల్ మరియు ఇంటిలో ఉర్దూ గ్రామర్ రాసుకుంటున్న ఫొటోస్ వీడియోస్ తో social media లొ తప్పుడు ప్రచారం చేశారు.
వీరిపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలియజేశారు.
Accused persons :
A1. Mohammed Mubashir s/o Siddiq Ali age : 38 years, caste: muslim, occupation: teacher in Ekalavya
School PGT physics R/o Utnoor.
A2. Mohammed Asif R/o Kaghaznagar
A3. Sayyad Kaif S/o Mustafa age: 19 years, caste: muslim Occ: student inter 2nd year completed R/o
Hasnapur Utnoor mandal.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments