– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రక్తదానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది
ప్రసవానికి వచ్చిన ఆదివాసి మహిళ రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు అత్యవసరంగా స్పందించి రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ
తనను ఆదర్శంగా తీసుకొని యువత, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం అర్ధ రాత్రి రిమ్స్ ఆసుపత్రి నందు రక్తహీనతతో ప్రసవానికి వచ్చిన 8 నెలల గర్భిణీ గాదిగూడ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రాంబాయి అనే మహిళకు అత్యవసరంగా రక్తం కావలసినప్పుడు ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి స్పందించి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తాన్ని సృష్టించలేమని ఖచ్చితంగా అవసరమైన వారికి రక్తం దానం చేస్తే తప్ప లభించదు కావున రక్త దానం చేయడం మంచిదని, ప్రజలు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలలో నివసిస్తూ ప్రసవానికి వచ్చిన మహిళలకు, ఆదివాసీలకు రక్తం ఎల్లప్పుడూ అవసరం ఉంటుందని కావున యువత తనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని తెలిపారు.


Recent Comments