◾️30% హైవేపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యం…
◾️ప్రతి దాబాలో సిసి టీవీ కెమెరాలు తప్పనిసరి….
ఇచ్చోడా : బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాబా ఓనర్స్ తో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో హైవే దాబాలలో మద్యం సేవించడం, వ్యభిచారం ప్రోత్సహించడం, ఇతర రాష్ట్రాల దొంగలతో కుమ్మకు అయిన పనివారిని ఏర్పాటు చేసుకోవడం లాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైవేలపై ఉన్న ధాభాలలో సరైన పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసుకోవాలని, ధాభా ఏరియా మొత్తం సీసీటీవీ కెమెరాల పరిధిలో వచ్చే విధంగా 30 రోజుల బ్యాకప్ తో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దాబాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వాహనాలలో అనుమానస్పదంగా ఉన్న వ్యక్తుల వివరాలను వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియ జేయాలన్నారు. ప్రస్తుతం వైద్యశాఖ వివరాల ప్రకారం దాబాలు నిర్వహిస్తున్న గ్రామాల పరిధిలో వ్యభిచారం నిర్వహించడం వల్ల హెచ్ఐవి కేసులు నమోదవుతున్నట్లు, యువత చెడు వ్యసనాల వైపు వెళ్ళకుండా సన్మార్గం లో పయనించాలని సూచించారు. దాబాలో దొంగతనాలు నిర్వహించే ముఠా జాడ తెలిసినప్పుడు వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. దొంగలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్మార్గంలో దాబాలను నిర్వహించడం వల్ల ఎక్కువగా ప్రజలు ఆకర్షితులై వ్యాపారంలో లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో 30 దాబాలకు సంబంధించిన ఓనర్స్, ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, ఇచ్చోడా సీఐ ఎం నైలు, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, నీరేష్, శ్రీకాంత్, పాల్గొనడం జరిగింది.

Recent Comments