రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంద్రానగర్ నందు నివసిస్తున్న నిందితుడు చిలకల ప్రణీత్ (25) అలియాస్ సిద్దు అనే వ్యక్తి తండ్రి శ్రీనివాస్ తో గొడవకు దిగి తనని చేతులతో కొట్టినాడని తండ్రి ఫిర్యాదుతో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని తెలిపారు.

వివరాలలో కొడుకు ప్రణీత్ @ సిద్దు తండ్రి శ్రీనివాస్ తో గొడవకు దిగి, చేతులతో కొట్టి, అక్కడ ఉన్న పెద్ద అద్దం ముక్కను కింద పడేసి దానితో చంపేస్తానని బెదిరించినాడని, దానితోపాటు అడ్డువచ్చిన తన తల్లి పై కూడా బెదిరించినాడని తండ్రి ఫిర్యాదుతో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని తెలిపారు. అర్ధరాత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితునిపై కేసు నమోదు అయి విచారణ జరుగుతుందని తెలిపారు.
Recent Comments