• సోషల్ వర్కర్ ముబారక్
ఇచ్చోడ: మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలలో సానిటేషన్ నిర్వహించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సోషల్ వర్కర్ ముబారక్ గ్రామపంచాయతీ ఈఓ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో కోతుల బెడద, కుక్కల బెడద ఎక్కువైందని పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై కోతులు దాడి చేయడంతో విద్యార్థినులు ప్రమాదానికి గురవుతున్నారని అన్నారు. మండల కేంద్రంలో కోతుల బెడద, కుక్కల బెడదను నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. మండల కేంద్రంలోని ఇస్లాంపుర , రంజాన్ పుర, మస్జిద్ గల్లీ కాలనీలు మురికి నీరుతో దుర్గంధం వెదజల్లుతున్నాయని వెంటనే సానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీరుతో జలమయం అయ్యాయని, మురికి నీరు ఇండ్లలోకి చేరి దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వెంటనే దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్ తో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాలనీలలో పలుచోట్ల విద్యుత్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.
Recent Comments