రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అక్షిత (6) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తమ వ్యవసాయ భూమి పక్కన ఉన్న మడుగులో అకస్మాత్తుగా పడి మృతి చెందిన విషయం అందరిని కలిచివేసింది. వివరాల్లోకి వెళితే మండలంలోని గురుజ గ్రామానికి చెందిన సలాం ప్రభాకర్ అనే వ్యవసాయ కూలి కూతురు అక్షిత, నిన్న వ్యవసాయ పనులకని తల్లి తండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా అటుగా వచ్చిన అక్షిత తల్లి దగ్గర ఆడుకుంటూ అటు కాసేపు తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. సాయంత్రం అవుతున్న ఇంకా అక్షిత కనబడం లేదని ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా అనుమానం వచ్చి తమ వ్యవసాయ క్షేత్రానికి పక్కనే ఉన్న మడుగులో పోలీసులు గ్రామస్తుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎంత వెతికిన చిన్నారి అక్షిత ఆచూకీ తెలియలేదు, రాత్రి నుండి కురుస్తున్న వర్షంలో కూడా గ్రామస్తుల సహాయంతో పోలిసులు ఉదయం వరకు గాలింపు చేపట్టారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి మడుగులో నీరు అధికంగా వచ్చిచేరింది. దాదాపు 5 గంటలు శ్రమించిన గ్రామస్తులు, పోలీసులకు ఈ రొజు ఉదయం అక్షిత మృతదేహం లభ్యమైందని గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. కాగా చిన్నారి అక్షిత మడుగులో పడి మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


Recent Comments