డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.అయితే ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. అయితే వీటిని తినడానికి సరైన సమయం తెలుసుకోవటం మంచిది.డ్రై ఫ్రూట్స్ తినేముందు వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇలా చేయడం వల్ల గింజల్లో వేడి కలిగించే గుణం తగ్గుతుంది. అలాగే ఫైటిక్ యాసిడ్ ఇంకా టానిన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనం వాటి నుంచి పోషకాలు గ్రహించడం సులభమవుతుంది. ఒకవేళ మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే.. డ్రై రోస్ట్ చేసి తినడం మంచిది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చునని చెబుతున్నారు.డ్రై ఫ్రూట్స్ పొద్దున్నే తినడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి స్వభావం కలిగిన డ్రై ఫ్రూట్స్ నీటిలో నానబెట్టి, వాటి పై తొక్క తీసి తర్వాత తినాలి. ప్రతిరోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. కానీ, వయస్సు, ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని తింటే మంచిది. డ్రై ఫ్రూట్స్ జీర్ణక్రియ ప్రక్రియకు మద్దతునిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు. లేదంటే, సాయంత్రం స్నాక్‌గా కూడా నట్స్ తినొచ్చని సూచిస్తున్నారు. ఇలా తింటే.. ఎక్కువగా ఆహారం తినాలనే కోరిక తగ్గుతుందని చెబుతున్నారు.డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. డ్రై ఫ్రూట్స్ శక్తిని కలిగి ఉంటాయి. ఇది రోజంతా మీకు శక్తిని ఇస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్ ఇ, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. నోటి అందాన్ని కాపాడుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, క్యాల్షియం శరీర కండరాలను నిర్వహించడానికి సహాయపడతాయి.

అల్లం టీ ఎంత మంచిదో తెలుసా?
అల్లం టీ ఎంత మంచిదో తెలుసా?అల్లం సువాసన ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల విశ్రాంతిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని కొందరు పరిశోధకులు కనుగొన్నారు.కొన్ని అధ్యయనాల్లో అల్లం అధిక ఆకలిని తగ్గిస్తుందని తేలింది. ద్వారా బరువును అదుపులోకి ఉంచుకోవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామాలతో పాటు అల్లం టీ తాగడం వల్ల బరువు వేగంగా తగ్గించడంలో సాయపడుతుంది.అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అల్లం టీ తాగడం వల్ల శరీరాన్ని ఇన్‌ఫెక్షన్‌లను నివారించగలదు. రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో సాయపడుతుంది.అల్లం రక్తంలో చక్కెర స్థాయిలపై తగ్గించగల గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం ఉన్న వారి అల్లం టీ చాలా ప్రయోజనంగా ఉంటుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడానికి చాలా అల్లం బెస్ట్ అని చెప్పవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెరుగైన రక్త ప్రసరణ కూడా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. అల్లం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల కండరాల అసౌకర్యం ఉన్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.అల్లం టీ మోషన్ సిక్‌నెస్, గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, శస్త్రచికిత్స అనంతరం కలిగే వికారంను తగ్గించే సామర్థ్యం ఉంది.ఆహారం చక్కగా అరిగేలా జీర్ణక్రియకు సహాయపడుతుంది.అయితే అల్లం టీని మాత్రం ఎక్కువ కాకుండా కేవలం మితంగా మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

గోర్లు కొరకడం వల్ల..
ఇన్ని అనారోగ్య సమస్యలా..!!
చాలా మందికి జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో మనం ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.ముఖ్యంగా మన గోర్లలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని వైద్యుల సైతం తెలియజేస్తూ ఉంటారు..సాధారణంగా మనం రోజు మొత్తంలో చేతులను చాలాసార్లు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాము. ముఖం నుంచి శరీర భాగాలకు వరకు తాకుతూనే ఉంటాము.. అయితే ఇలా అందమైన గోర్ల క్రింద లక్షలాది సూచన క్రిములు కూడా నివసిస్తుంటాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా గోర్ల కింద 32 రకాల బ్యాక్టీరియాలో 28 రకాల ఫంగస్ లు వ్యాపింప చేసేటువంటి ఉంటాయని ఒక పరిశోధనలో తెలియజేశారు. ఈ పరిశోధన 2021లో జరిగింది.. కొంతమంది గోర్ల కింద నుంచి శాంపుల్స్ తీసుకొని పరీక్షించగా అందులో ఇవి బయటపడ్డాయట అయితే ఇందులో 50% నమూనాలు బ్యాక్టీరియా మాత్రమే ఉందని..6.3% ఫంగస్ను కలిగి ఉందని..43.7% బ్యాక్టీరియా ఫంగస్ మిశ్రమాలలోని సైతం కలిగి ఉన్నాయని తెలియజేశారు.ముఖ్యంగా కాలి గోర్లలో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడిరచారు.. అందుకే గోర్లు చేతులు చాలా శుభ్రపరమైనవి గా ఉంచుకోవాలి.ముఖ్యంగా మనం తినడానికి ముక్కు తుడుచుకోవడానికి లేదా ఎవరైనా కౌగిలించుకోవడానికి మన చేతులను ఉపయోగిస్తాము.. అటువంటి పరిస్థితులలో గోర్లు శుభ్రంగా ఉండాలి.. అయితే పరిశోధకులు తెలుపుతున్న సమాచారం ప్రకారం గొర్ల కింద ఉండే బ్యాక్టీరియా ఫంగస్ వంటివి హాని చేయవని తెలియజేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఈ సూక్ష్మక్రియలు చాలా బలహీనమై ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారిలో ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఈజీగా ప్రవేశిస్తాయని తెలుపుతున్నారు.. దీనివల్ల గోర్లు రంగు మారడం వాపు చీమునొప్పి వంటివి వస్తాయట. గోర్లను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి. గోర్ల కింద మురికి పేరుకుపోకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.. కనీసం రోజులో రెండు మూడు సార్లు అయినా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

ఈ ఆకు రసం తాగితే
కీళ్ల నొప్పులు పరార్..!
మన పూర్వీకుల నుంచి పుదీనా వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రుచికి రుచి సువాసన కూడా కలిగి ఉంటుంది.. పుదిన వివిధ వ్యాధులను కూడా నయం చేయడానికి వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.పుదీనా ఆకులు వేడి వాతావరణం లో కూడా శరీరాన్ని చాలా చల్లగా ఉంచేలా చేస్తుంది. పుదీనా ఆకులను నమ్మడం వల్ల కూడా నోటిలో ఉండేటువంటి దుర్వాసనను కూడా తొలగించేలా చేస్తుంది. అంతేకాకుండా దంతాలకు కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు. మరి పుదీనా వల్ల మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. పుదీనా ఆకు రసం నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఏదైనా సందర్భంలో తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా టీ తాగడం లేదా ఆకులను నమ్మలడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకుల పేస్ట్ కీళ్ల నొప్పిలను కూడా తగ్గిస్తుంది.. పుదీనా ఆకులలో ఉండేటువంటి అమ్మినోయాసిడ్, పొటాషియం ,జింక్ వంటివి చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచేలా చేస్తాయి. పుదీనా ప్యాక్ వల్ల చర్మం మీద మొటిమలు కూడా తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జలుబు దగ్గుతో ఇబ్బంది పడేవారు పుదీనా ఆకులను తినడం చాలా మంచిది. పుదీనా ఆకులను మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా దుర్వాసన కూడా తగ్గిపోతుంది. అలాగే దురదను కూడా తగ్గించడానికి ఈ పుదీనా చాలా సహాయపడుతుంది. జీర్ణ క్రియను బలోపేతం చేయడానికి కూడా పుదీనా సహాయపడుతుంది. జుట్టు రాలిపోతుంటే రెండు మూడు రోజులపాటు పుదీనా ఆకులను బాగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఏదైనా గాయాలు అయినప్పుడు లేకపోతే కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని కాళ్లకు రాసుకొని తిప్పుకోవడం వల్ల నెమ్మదిగా నొప్పులు సైతం మటుమాయం అవుతాయి.. పుదీనా ఆయిల్ తో నైనా సరే మసాజ్ వంటివి చేయించుకోవడం వల్ల మంచి లాభాలు లభిస్తాయి.

దివ్య ఔషధం సబ్జా గింజలు..!!
చాలామంది ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.. సాధారణంగా సబ్జా గింజలు చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే విటమిన్..స, A తోపాటు ఐరన్ ప్రోటీన్ ఫ్యాట్ అనేది కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది.. బరువు తగ్గాలనుకునే వారికి ఈ సబ్జా గింజలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కొద్దిగా తిన్న కడుపు నిండినట్టుగా అనిపిస్తుందట. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధక సమస్యతో గ్యాస్ సమస్యతో అసిడిటి సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సబ్జా గింజలు ఉపయోగించడం చాలా మంచిది.. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారు కూడా వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్క్రీన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి చర్మం కాంతివంతంగా కూడా మెరుస్తుంది. అలాగే శరీరంలో జీవక్రియను కూడా వేగవంతం చేసి శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గించేలా చేస్తుంది. సబ్జా గింజలని ఎప్పుడైనా సరే నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి ఇవి డ్రైగా ఉన్నప్పుడు అసలు తీసుకోకూడదు.. అలా తీసుకుంటే రాక్షసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా గొంతులో ఇరుక్కుపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఈ సబ్జా గింజలను కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలకు అందులో కాసిన్ని చల్లటి నీటిని కలుపుకొని తాగాలి. ఎండాకాలం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ఉదయం పరగడుపున తాగితే సరైన ఫలితాలను అందుకోవచ్చు.. లేకపోతే ఏదైనా జ్యూసులలో వేసుకొని తాగినా కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఎండాకాలం ఈ సబ్జా గింజలను తీసుకోవడం మంచిది.

మంచినీరు రోజుకు ఎన్ని తాగాలో తెలుసా?
ప్రతిరోజు తగినన్ని నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. మీరు ఎంత బాగా తాగితే ఆరోగ్యం అంత బాగా ఉంటుందని, అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతూ ఉంటారు.ప్రతిరోజు మనిషి ఖచ్చితంగా తప్పకుండా రెండు లీటర్ ల నీరు కంటే ఎక్కువ నీదే తాగాలని చెబుతూ ఉంటారు. లేదంటే గ్లాసులతో పోలిస్తే కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కానీ మనం ప్రస్తుతం పనుల్లో పడి కనీసం మీరు తాగడానికి కూడా మనకు సమయం లేకుండా పోయింది.అలాంటప్పుడు మనం తినే ఆహారం ద్వారా అయినా శరీరానికి కావల్సిన నీరును అందించాలి. రెండు లీటర్ల నీరు కచ్చితంగా తాగాలంటూ దాహం వేయకపోయినా కొందరు తాగుతుంటారు. వారు చేసే పని, ఉండే ప్రదేశం, ఆహారపు అలవాట్లు ఇలా అనేకరకాల అంశాలపై నీరు తాగడమనేది ఆధారపడి ఉంటుంది. వ్యాయామానికి ముందు, వ్యాయామం అయిన తర్వాత లేదంటే బాగా దప్పిక వేసినప్పుడు మాత్రమే నీరు శరీరానికి బాగా ఉపయోగడపతాయి. నీరు ఎంత తీసుకున్నా మంచిదే అన్న భ్రమలో ఎవరూ ఉండొద్దని, ఎక్కువ నీరు తీసుకోవద్దని, అలా తీసుకుంటే ఎన్నో అనర్థాలు కూడా ఉంటాయట. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఈ వేసవికాలంలో శరీరానికి తగినన్ని నీరు తీసుకోకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి వేసవిలో శరీరానికి తగినన్ని నీరు తాగాల్సిందే. కాబట్టి ఒక్క వేసవిలో అని మాత్రమే కాకుండా ఇతర కాలాలలో కూడా శరీరానికి సరిపడా నీరు తాగాలి. అలా అని ఎక్కువ నీరు తీసుకున్న కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి.

షుగర్ ఉన్నవారు బెల్లం తింటే..!
ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం రావడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు జీవనశైలిని అని చెప్పవచ్చు. 11 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ళు వృద్ధుల వయసు వారి వరకు చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ సమస్య పెరిగిపోవడంతో ప్రతిరోజుల్లో చాలామంది చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని తినవచ్చా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అయితే స్వచ్ఛమైన రూపంలో దొరికితేనే తినాలట. ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన బెల్లం దొరకడం అసాధ్యమని చెప్పవచ్చు. పంచదార కన్నా బెల్లమే ప్రమాదకరంగా మారిందని, బెల్లంతో చేసినవి తినడం మానేయాలని, అవసరమైతే స్వచ్ఛమైన బెల్లంతో ఇంట్లో చేసుకొని తినాలని చెబుతున్నారు వైద్యులు. మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి అని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా షుగరు సంక్రమిస్తోందట. విటమిన్లు, మినరల్స్, ఖనిజాల సమతుల్యత ఉన్న ఆహారాన్ని ఎవరూ తీసుకోవడం లేదని, ఇది కూడా షుగరు రావడానికి ఒక ప్రధాన కారణమవుతోందని అంటున్నారు వైద్యులు. ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి మారిపోతోంది. ఇష్టమొచ్చిన సమయానికి నిద్రపోయి ఇష్టమొచ్చిన సమయానికి లేస్తున్నారు. దీనివల్ల వ్యాయామం కూడా చేయడం లేదు. మధుమేహ వ్యాధి రావడానికి ఇది కూడా ఒక కారణమవుతోంది. విస్తృతమైన కాలుష్యం కూడా మధుమేహానికి కారణమవుతోందని, స్వచ్ఛమైన గాలి లేకపోవడం కూడా ఒక కారణమంటున్నారు. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం కూడా ప్రజలకు సమస్యగా మారుతోంది. దీనివల్ల కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి జీవనశైలి ఆహారము అలవాట్లు మార్చుకోవాలి. అలాగే శారీరక శ్రమ తప్పనిసరి.