• Other News
  • Live TV
  • పొట్టను లవంగంతో కరిగించవచ్చు..!

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..!

    ఈ మధ్యకాలంలో జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా మన శరీరం మన కంట్రోల్‌ లేకుండా పోతుంది.మరీ ముఖ్యంగా అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, మధుమేహం, గుండె జబ్బులు చుట్టుముడుతూ ఉన్నాయి.అందులోను వందలో 90 మంది పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయి,అధిక బరువు సమస్యను ఎదుర్కొంటు ఉన్నారు.వీరికి ఆరోగ్యం క్రమంగా దెబ్బతినడమే కాకుండా,అందం కూడా తగ్గుతూ ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నీ దూరం చేయడానికి మనకు ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.అందులో భాగంగా లవంగం చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారా..ఇంకెందుకు ఆలస్యం లవంగాలను ఎలా ఉపయోగించాలో,వాటి ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి.. సాధారణంగా లవంగాలను మసాలా దినుసులతో తయారుచేసే ఆహార పదార్థాలలో మాత్రమే వాడుతూ ఉంటాము.కానీ రోజుకు రెండు లవంగాలను కషాయం రూపంలో కానీ,పొడి చేసి స్మూతీలపైన,సలాడ్లపై చల్లి తీసుకోవడం వల్ల,పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతూ వస్తుంది.ఎందుకంటే.. లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్‌,యాంటీ ఒబెసిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్‌,ఫెనోలిక్‌,విటమిన్‌ %జ% లు కూడా విరివిగా దొరుకుతాయి.వీటిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడంతో,మన శరీరంలో ఉన్న వ్యర్థాలను,చెడు కొవ్వులను ఈజీగా తొలగిస్తాయి.దీనితో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా,ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాక మన పొట్ట లోపల ఆరోగ్యంగా ఉందో లేదో మనం తెలుసుకోలేము.అందువల్ల లవంగాల వంటివి రోజుకు రెండు చొప్పున తీసుకోవడంతో,అవి పొట్టలోపల అంతా క్లీన్‌ చేస్తాయి.జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image


    శరీరాన్ని బలంగా మార్చే ఎండుద్రాక్ష
    ఎండుద్రాక్షలో విటమిన్లు ఇ, సి, కె, బి, ఎ కాకుండా ఎండుద్రాక్షలో ఐరన్‌, బి-కాంప్లెక్స్‌తో సహా అనేక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష కరిగే ఫైబర్‌కు మంచి మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల బలానికి తోడ్పడుతుంది. శరీరంలో ఐరన్‌ లోపాన్ని తొలగిస్తుంది. ఇది దంతాలు, ఎముకలను కూడా బలపరుస్తుంది. చర్మ సంరక్షణలో కూడా ఎండుద్రాక్ష ఎంతగానో తోడ్పడుతుంది. ఎండుద్రాక్షలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని పెంచే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఎండుద్రాక్ష పూర్తి ప్రయోజనాలను పొందడానికి, మీరు ఐదు నుండి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టిన 5 నుండి 6 ఎండుద్రాక్షలను తినాలి. నానబెట్టిన ఎండుద్రాక్ష మీ శరీరానికి మరింత మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు నోటి దుర్వాసనను పోగోడుతుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఎండు ద్రాక్ష సహాయపడుతుంది. ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల అనీమియా సమస్య ఉండదు. శరీరంలో టాక్సిన్స్‌ ను నివారించడంలో ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హార్ట్‌ డిసీజ్‌ ను నివారిస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్‌ కంటెంట్‌ తో పాటు ఇతర న్యూట్రీషియన్స్‌ కూడా అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కంట్రోల్‌ చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే నేచురల్‌ ఫ్రక్టోజ్‌ ఎనర్జీ లెవల్స్‌ ను పెంచుతుంది. ఎండు ద్రాక్షను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకుంటే, వీక్‌ నెస్‌ ను తగ్గిస్తుంది. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎండు ద్రాక్షను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌ లక్షణాలను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్‌, విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌, అన్ని రకాల న్యూట్రీషియన్స్‌ ను కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image

    ఉదయాన్నే ఖాళీ కడుపుతో
    ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..?
    ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మనమందరం ఆరోగ్యకరమైన, రిఫ్రెష్‌గా ఏదైనా తినాలని లేదా త్రాగాలని కోరుకుంటాము. అటువంటి పరిస్థితిలో మనలో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. తాజా పండ్లతో చేసిన జ్యూస్‌ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్‌ జ్యూస్‌ తాగాలి. కానీ, మీరు ఇలాంటి అలవాట్ల కారణంగా చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు ప్రయోజనం కంటే.. ఎక్కువ హాని కలిగించవచ్చు. అవును, మీరు ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగితే, అది మీకు హానికరం. ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగడం వల్ల మీకు ఎలాంటి హాని కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. అన్ని రకాల పండ్లలో ఫైబర్‌ ఉంటుంది. ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కానీ పండ్ల రసంలో ఫైబర్‌ ఉండదు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించలేదు. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇదీ కాకుండా, పండ్ల రసంలో ఎక్కువ చక్కెర ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. పండ్ల రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. కానీ, అది కూడా సమానంగా త్వరగా పడిపోతుంది. దీని కారణంగా శక్తి లేకపోవడం, అలసటగా అనిపిస్తుంది. శరీరానికి శక్తి కోసం కేలరీలు అవసరం కాబట్టి, త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగడం వల్ల మీ దంతాలకు నష్టం వాటిల్లుతుంది. వాస్తవానికి, పండ్ల ఆమ్లత్వం రసంలో పేరుకుపోతుంది. ఇది ఎనామెల్‌ అని పిలువబడే దంతాల పై పొరను దెబ్బతీస్తుంది. దీని కారణంగా, దంతాలలో కుహరం, సున్నితత్వం కూడా సంభవించవచ్చు. పండ్లలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఫైబర్‌ ప్రేగులలో ఆహారాన్ని సులభంగా తరలించడంలో సహాయపడుతుంది, దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వంటి సమస్య ఉండదు. కానీ పండ్ల రసాలలో ఫైబర్‌ ఉండదు. దీని కారణంగా అవి జీర్ణక్రియకు సహాయపడవు.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image


    ఉలవలతో కరుగును రాళ్లు..!
    ఉలవలను ఉడికించి లేదా మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇవి అనేక రోగాలను నివారిస్తాయి. శరీరంలోని గ్లూకోజ్‌ ను అదుపు చేయడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇదే కాదు ఉలవలు బీపీని కూడా అదుపులో ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది. ఉలవల్లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నీరసం, నిసత్తువను తగ్గిస్తాయి. ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీలో రాళ్లను నయం చేయడానికి ఉలవలను ఉపయోగించవచ్చు. ఇది ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, స్టెరాయిడ్లు మరియు సపోనిన్లు వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలను నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. రోజూ ఉదయాన్నే ఉలవల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్‌ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఉలవల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image


    కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు..
    జీడిపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి.ఇందులో ఒమేగా 3, డైటరీ ఫైబర్‌, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపుకు పదును పెడుతుంది.జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది జీవక్రియను నియంత్రించడం. అవును.. ఇందులోని మెగ్నీషియం కొవ్వు, కార్బోహైడ్రేట్ల జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే జీడిపప్పులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఇవి కొవ్వును కాల్చడంలోనూ సహాయపడతాయి. ఇది బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.జీడిపప్పులో పీచు, ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ పరిమిత మోతాదులో తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు సజావుగా పనిచేస్తుంది. జీడిపప్పులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీడిపప్పులో ఉండే లుటిన్‌, జియాక్సంతిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను నివారిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image


    పసుపు ఇలా వాడారంటే
    తలలో చుండ్రు ఇట్టే మాయం!
    భారతీయుల వంట గదుల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వంట పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యంలోనే కాదు అందంలో పసుపుకు డిమాండ్‌ ఎక్కువే. మొటిమల నుండి టాన్‌ వరకు, పసుపు వేలాది చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా జుట్టు సంరక్షణలో పసుపు వినియోగించారా? జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదలలో పసుపు ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో అనేక జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కరిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడం, తల దురద, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి హెయిర్‌ ఫోలికల్స్‌ ను రక్షిస్తాయి. పసుపు తలపై యాంటీ ఫంగల్‌ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది ఫంగస్‌తో పోరాడి, చుండ్రును నివారిస్తుంది. పసుపు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా బలమైన జుట్టును అందిస్తుంది. అయితే జుట్టు సంరక్షణలో పసుపును ఎలా వినియోగించాలంటే.. రోజువారీ షాంపూలో 1 టీస్పూన్‌ పసుపు పొడిని కలుపుకోవాలి. దీనిని స్కాల్ప్‌ శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇది చుండ్రు నివారణతోపాటు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే 1/4 కప్పు కొబ్బరి నూనెలో 1 టీస్పూన్‌ పసుపు పొడిని కలపాలి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు ఈ నూనెను తలకు, జుట్టుకు పట్టించి మసాజ్‌ చేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. 1/2 కప్పు పుల్లని పెరుగులో 2 స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, 2 స్పూన్ల పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

    పొట్టను లవంగంతో కరిగించవచ్చు..! - Additional Image


    ఉల్లిపాయలు తినకపోతే ఏమి అవుతుంది?
    ప్రపంచవ్యాప్తంగా వంటలో ఉపయోగించే కూరగాయలలో ఉల్లిపాయ ఒకటి. బర్గర్‌ నుంచి స్టైర్‌ ఫ్రైస్‌ వరకు ప్రతిదానిలో ఉల్లిని జోడిస్తుంటారు. కొందరికి దీని రుచి నచ్చదు. ఉల్లిపాయలను పచ్చిగా తింటే నోటి దుర్వాసన రావడానికి కూడా ఇదే కారణం. అయితే ఉల్లి ఒక నెల రోజులపాటు అస్సలు తినకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా అలోచించారా? ఉల్లిపాయలు కేవలం ఆహారానికి అదనపు రుచిని అందించేవి మాత్రమే కాదు. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయల్లో విటమిన్‌ సి, బి6, ఫోలేట్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి ఆహారంలో ఉల్లిపాయలు తప్పక తీసుకోవాలి. అంతేకాకుండా ఉల్లిపాయలు అల్లైల్‌ ప్రొపైల్‌ డైసల్ఫైడ్‌ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది చాలా అవసరం. వీటిని ఆహారంలో తొలగించడం వల్ల ఫైబర్‌ తీసుకోవడం తాత్కాలికంగా తగ్గుతుంది. ఫలితంగా మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఉల్లిపాయల్లో అల్లిసిన్‌, క్వెర్సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

    📰 e-Paper Clip
    Google News Follow