ఎన్‌ఆర్‌ఐలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్.వి. కె. రెడ్డి గారు మరియు పలు విభాగాల డైరెక్టర్లు ప్రొ. డి . రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవి కాబడే, ప్రొ. కె శ్రీదేవి, డా. వెంకటేశ్వర్లు పాల్గొని, ఎన్‌ఆర్‌ఐలకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా కోర్సులు, అర్హతలు, ఫీజులు, అడ్మిషన్లు, పరీక్షల విధానం తదితర అంశాలను స్పష్టంగా వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు తమ నివాస దేశం నుంచే ఉన్నత విద్యను కొనసాగించే విధంగా డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర ఉన్నత విద్యా అవకాశాలను...