‘సీఎం ప్రవాసీ ప్రజావాణి సందర్శించిన గల్ఫ్ సోషల్ వర్కర్స్‌

సౌదీ అరేబియా: గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర కీలకం హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై గల్ఫ్ సామాజిక సేవకులు పొన్నం సత్యనారాయణ (దుబాయి) మరియు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ప్రతినిధి ఖాజా ముజాములుద్దీన్కు మంగళవారం సత్కరించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, ‘సీఎం ప్రజావాణి’ ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ఇద్దరు సామాజిక సేవకులను అభినందించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంబసీలు, కాన్సులేట్లతో సమన్వయం చేసుకుంటూ...