సతమోరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవం

సిరికొండ, సెప్టెంబర్ 25: లచంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సతమోరి సెంటర్‌లో పోషణ మహోత్సవం అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల మాట్లాడుతూ ప్రతి గర్భిణీ, బాలింత, కిశోర బాలిక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. రక్తహీనతను నివారించడంతో పాటు గర్భంలోని శిశువు సరైన శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని వివరించారు. గర్భిణీలు గర్భధారణ సమయంలో కనీసం నాలుగుసార్లు వైద్యుల...